RRB NTPC UG Recruitment : డిగ్రీ లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు! అప్లికేషన్ ప్రక్రియ షురూ..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్బీ) ఇంటర్మీడియట్ విద్యార్హతతో 1,688 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్, వయోపరిమితి, పరీక్షా విధానం, ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు ఇక్కడ పరిశీలించండి..

Published on: Oct 15, 2026, 14:10:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అప్డేట్! రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్టీపీసీ) అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియం రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్బీ) నేడు, అక్టోబర్ 15న ప్రారంభించింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (CEN 07/2026) కింద వెలువడిన ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో మొత్తం 1,688 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 13 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్..
ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్..

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​- పోస్టులు..

రైల్వే శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో ఇంటర్మీడియట్ (10+2) విద్యార్హత ఉన్న అభ్యర్థులకు నాలుగు రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అవి..

  • కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్: 700 పోస్టులు
  • జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 600 పోస్టులు
  • అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 200 పోస్టులు
  • ట్రైన్స్ క్లర్క్: 188 పోస్టులు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం పే లెవెల్-2, లెవెల్-3 కింద నెలకు రూ. 19,900 నుంచి రూ. 21,700 వరకు ప్రారంభ ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి తోడు కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్​ర్​ఏ) వంటి ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అదనంగా అందుతాయి.

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అధికారిక పోర్టల్‌లో ప్రారంభమైంది. అభ్యర్థులు గమనించాల్సిన కీలకమైన తేదీల పట్టిక:

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 15, 2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 13, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)

ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 15, 2026

దరఖాస్తుల సవరణ : నవంబర్ 16 నుంచి నవంబర్ 25, 2026 వరకు

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ 2026- వయోపరిమితి, విద్యార్హతలు..

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ కోసం 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు:

జనరల్ / ఈడబ్ల్యూఎస్ : జనవరి 2, 1997 నుంచి జనవరి 1, 2009 మధ్య జన్మించి ఉండాలి (గరిష్ట వయస్సు 30 ఏళ్లు).

ఓబీసీ - నాన్ క్రీమీలేయర్ : జనవరి 2, 1994 నుంచి జనవరి 1, 2009 మధ్య జన్మించి ఉండాలి (గరిష్ట వయస్సు 33 ఏళ్లు).

ఎస్సీ / ఎస్టీ : జనవరి 2, 1992 నుంచి జనవరి 1, 2009 మధ్య జన్మించి ఉండాలి (గరిష్ట వయస్సు 35 ఏళ్లు).

విద్యార్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ 50 శాతం మార్కుల నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

అయితే దరఖాస్తుల చివరి తేదీ నాటికి ఫలితాలు రాకుండా ఎదురుచూస్తున్న వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు కారు అని గుర్తుపెట్టుకోవాలి.

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక విధానం..

రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ-1, సీబీటీ-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్​మెంట్​ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

తొలి దశ పరీక్ష (సీబీటీ-1):

ఇది అందరికీ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షగా ఉంటుంది. ఇందులో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు (దివ్యాంగులకు 120 నిమిషాలు).

  • జనరల్ అవేర్‌నెస్: 40 ప్రశ్నలు
  • మ్యాథమెటిక్స్: 30 ప్రశ్నలు
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 30 ప్రశ్నలు

ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించగా, ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

రెండో దశ పరీక్ష (సీబీటీ-2):

సీబీటీ-1 లో సాధించిన మెరిట్ ఆధారంగా ఖాళీలకు 15 రెట్ల మంది అభ్యర్థులను రెండో దశ పరీక్షకు ఎంపిక చేస్తారు. సీబీటీ-2 లో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.

  • జనరల్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు
  • మ్యాథమెటిక్స్: 35 ప్రశ్నలు
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 35 ప్రశ్నలు

ఈ పరీక్షలో కూడా ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది.

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు విధానం..

అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక పోర్టల్ rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్బీ (ఉదాహరణకు ఆర్‌ఆర్బీ సికింద్రాబాద్) ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఆర్ఆర్బీలకు దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు తమ ప్రాధాన్యత ప్రకారం సికింద్రాబాద్ లేదా ఇతర జోన్లకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More