UGC NET 2026 Registration : యూజీసీ 'నెట్‌' నోటిఫికేషన్‌ విడుదల - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ప్రాసెస్ ఇలా...

UGC NET December 2026 Registration : యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్షకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

Published on: Oct 9, 2026, 14:31:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

UGC NET December 2026 Registration : దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సాధించాలనుకునే అభ్యర్థులకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. యూజీసీ నెట్ (UGC NET) డిసెంబర్ 2026 నోటిఫికేషన్ విడుదల కాగా… పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరీక్షకు హాజరుకావాలనుకునే అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

యూజీసీ నెట్ డిసెంబర్ 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
యూజీసీ నెట్ డిసెంబర్ 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ముఖ్యమైన తేదీలు:

  • ఈ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 28, 2026 వరకు అవకాశం కల్పించారు.
  • ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పించడానికి అక్టోబర్ 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
  • అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి నవంబర్ 2 నుండి నవంబర్ 4, 2026 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
  • యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షలను 2026 డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 19 వరకు నిర్వహించనున్నారు.

యూజీసీ గుర్తించిన ఏదేని విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సులో కనీసం 55 శాతం మార్కులు (రౌండింగ్ ఆఫ్ లేకుండా) సాధించిన జనరల్, ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు, పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఈ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

ఎగ్జామ్ విధానం ఇలా….

యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్షను పూర్తి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది, అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ (బహుళ ఐచ్ఛిక) రూపంలోనే ఉంటాయి. రెండు పేపర్ల మధ్య ఎలాంటి విరామం ఉండదు. మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలు.

  • పార్ట్ 1 లో 50 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 100 మార్కులు కేటాయించారు.
  • పార్ట్ 2 లో 100 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 200 మార్కులు కేటాయించారు.
  • ఈ పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ విధానం ఉండదు, కాబట్టి అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.

జనరల్/అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1150 గా నిర్ణయించారు. జనరల్-ఈడబ్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 600 కాగా, ఎస్సీ/ఎస్టీ/PwD మరియు థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ. 325 రుసుముగా నిర్ణయించారు.

దరఖాస్తు చేసుకునే విధానం:

  • ముందుగా యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ను సందర్శించాలి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న "UGC NET December 2026 Registration" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అయిన తర్వాత అభ్యర్థులు తమ వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే దరఖాస్తు ఫారాన్ని వివరాలతో నింపాలి.
  • నిర్దేశించిన ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని ప్రింట్ తీసి భద్రపరుచుకోవాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More