Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు

Northeast Monsoon : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో మార్పులే ఇందుకు కారణం.

Published on: Oct 15, 2026, 12:13:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అక్టోబర్‌లోను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు వెళ్తే ఉక్కపోతతో జనాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, ఈశాన్య రుతుపవనాల కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీ, తెలంగాణ వర్షాలు
ఏపీ, తెలంగాణ వర్షాలు

కొన్ని చోట్ల ఈదురు గాలులతో పాటు కుండపోత వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తుపాను వలయం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. సోమవారం నుండి ఈశాన్య రుతుపవనాలు బలపడి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అక్టోబరు 15 గురువారం అల్లూరి, కాకినాడ, విశాఖపట్నం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కృష్ణా, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలోనూ ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపించనుంది. ఈశాన్య రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో గురువారం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వానలు పడనున్నాయి.

సుదీర్ఘకాలం పాటు మధ్యాహ్నాల్లో వేడి వాతావరణం కొనసాగిన తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో రాబోయే రెండు రోజుల్లో అక్టోబర్ వేడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. అక్టోబరు 17 నుంచి 19 వరకు కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో ఇటీవల ఉదయం పూట చల్లగా, మధ్యాహ్నం పూట వేడిగా ఉంటున్న వాతావరణం నుండి ఈ వాతావరణ సూచన ఉపశమనం కలిగిస్తోంది. ఉదయం చల్లగా ఉన్నప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే కొనసాగుతున్నాయి. ఉదయం 11 దాటితే బయటకు వెళ్తే.. ఎండాకాలం ఉన్నట్టుగా జనాలు ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికి వాతావరణం అకస్మాత్తుగా చల్లబడటానికి బదులుగా వేడి క్రమంగా తగ్గుతుందని వాతావరణ సూచనలు తెలియజేస్తున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More