TGPSC Recruitment 2026 : హైదరాబాద్ వాటర్ బోర్డులో 130 ఉద్యోగాలు - ఈనెల 17 వరకే దరఖాస్తుకు ఛాన్స్
TGPSC Manager Recruitment 2026 : హైదరాబాద్ జలమండలిలో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఈ గడువు అక్టోబర్ 17వ తేదీతో ముగియనుంది
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ షురూ కాగా…చివరి దశకు కూడా చేరుకుంటోంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 17వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు - విభాగాల వారీగా:
మొత్తం 130 మేనేజర్ పోస్టులలో వేర్వేరు ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వీటిలో అత్యధికంగా సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించారు.
- సివిల్ ఇంజినీరింగ్ : మొత్తం ఖాళీలలో 80 శాతం పోస్టులు…. అంటే 104 పోస్టులు సివిల్ విభాగం అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి.
- ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజినీరింగ్ : 15 శాతం పోస్టులు (19 ఖాళీలు) కేటాయించారు.
- సిఎస్ఇ / ఐటి / ఇసిఇ (CSE / IT / ECE): 5 శాతం పోస్టులు (7 ఖాళీలు) కేటాయించారు.
ఈ పోస్టులన్నీ మల్టీజోన్-2 పరిధిలోకి వస్తాయి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు వేతన స్కేలు లభిస్తుంది.
డిసెంబరులో రాత పరీక్షలు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2026 డిసెంబరు నెలలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు TGPSC తన తాత్కాలిక షెడ్యూల్‌లో పేర్కొంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది.
నోటిఫికేషన్, విద్యా అర్హతలు, వయోపరిమితి సడలింపులు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు ఇతర సమగ్ర వివరాల కోసం అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. గడువు ముగిసే సమయానికి సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
- దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 17, 2026
- రాత పరీక్షలు: 2026 డిసెంబరు నెలలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం
- అధికారిక వెబ్ సైట్ - https://www.tgpsc.gov.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

