స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు - జీవో నెంబర్‌ 9పై హైకోర్టు స్టే, ఎన్నికలకు బ్రేక్...!

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికల నోటిఫికేషన్‌ తో పాటు జీవో 9పై స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది.

Published on: Oct 9, 2025, 17:11:41 IST
By , Telangana, Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు హైకోర్టు స్టే విధించింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువునిచ్చింది.

బీసీ రిజర్వేషన్ల జీవోపై స్టే
బీసీ రిజర్వేషన్ల జీవోపై స్టే

ఎన్నికల నోటిఫికేషన్‌ పై కూడా న్యాయస్థానం స్టే విధించింది.హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది. హైకోర్టు ఆర్డర్‌ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

అంతకుముందు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. బీసీ జనగణన చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని వివరించారు. అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పారు.

ప్రభుత్వం తలపెట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని ఏజీ వాదనలు వినిపించారు. బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించామని… బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అవుతోందని చెప్పారు.

ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని ఏజీ తెలిపారు. గవర్నర్‌ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని… ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు.

ప్రభుత్వం తరపున మరో న్యాయవాది రవివర్మ కూడా వాదనలు వినిపించారు. 50 శాతం మించి రిజర్వేషన్ల పెంపునకు సరైన కారణాలు ఉన్నాయన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. బుధవారంతో పాటు ఇవాళ జరిగిన వాదనలు విన్న న్యాయస్థానం… జీవో 9తో పాటు ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది.

ఇవాళ కూడా విచారణ ఉండటంతో హైకోర్టు భారీ సంఖ్యలో బీసీ సంఘాల ప్రతినిధులు చేరుకున్నారు. అయితే కోర్టు స్టే విధించిన తర్వాత… హైకోర్టు గేటు దగ్గర బీసీ సంఘాల ఆందోళన చేపట్టాయి. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు.

హైకోర్టు తీర్పుపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని వ్యాఖ్యానించారు.

డ్రామా క్రియేట్ చేశారు - హరీశ్ రావ్

ఈ తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావ్ కూడా స్పందించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఉందని విమర్శించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ నేతలు.. జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా పోరాటం చేయాలన్నారు. కలిసి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమేనేని స్ప,్టం చేశారు.

22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్… గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారని హరీశ్ రావ్ విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని దుయ్యబట్టారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More