ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 34 పోస్టులన భర్తీ చేస్తారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను మే ,2026లో నిర్వహిస్తారు. హాల్ టికెట్ల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. మొత్తం 34 పోస్టులుండగా.. ఓపెన్ కేటగిరిలో 11 ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి పదో తరగతి మధ్య ఉత్తీర్ణులై ఉండాలి.2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 45 మార్కులకు రాత పరీక్షతో పాటు 5 మార్కులకు వైవా ఇంటర్వ్యూ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. అర్హత గల అభ్యర్థులు https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - హైకోర్టు, తెలంగాణ రాష్ట్రం
- ఉద్యోగాలు - ఆఫీస్ సబార్డినేట్
- ఖాళీలు - 34
- 7 నుంచి 10 తరగతి మధ్య ఉత్తీర్ణులై ఉండాలి.
- 2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి.
- దరఖాస్తులు ప్రారంభం - 7 ఫిబ్రవరి 2026
- దరఖాస్తులకు చివరి తేదీ - 28 ఫిబ్రవరి 2026
- జీతం - రూ.19,000-58,850
- ఎంపిక విధానం - రాత పరీక్ష ఆధారంగా రిక్రూట్ మెంట్ చేస్తారు. వైవా ఇంటర్వ్యూ కూాడా ఉంటుంది. 45 జనరల్ నాల్డెజ్ ప్రశ్నలతో కూడిన ఎగ్జామ్ ఉంటుంది. 5 మార్కులు ఇంటర్వ్యూకి కేటాయించారు.
- అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/
- హెల్ప్ లైన్ నెంబర్ - 040-23688394 ( ఉదయం10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు)
- హెల్ప్ డెస్క్ ఈమెయిల్ - helpdesk-tshc@telangana.gov.in.