TG Court Jobs : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలు - దరఖాస్తులు ప్రారంభం, ఇలా ప్రాసెస్ చేసుకోండి

రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.  అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 13వ తేదీతో అప్లికేషన్ గడువు ముగుస్తుంది.

Published on: Jan 29, 2026, 18:58:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్‌, టైపిస్ట్, కాపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ తో పాటు ప్రాసెస్ సర్వర్ పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అత్యధికంగా 319 ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు - దరఖాస్తులు ప్రారంభం
జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు - దరఖాస్తులు ప్రారంభం

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

జిల్లా కోర్టు ఉద్యోగాలు - దరఖాస్తు విధానం ఇలా…

  • అభ్యర్థులు ముందుగా https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని రిక్రూట్ మెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ లింక్ ఫర్ ఆన్ లైన్ అప్లికేషన్ ఉంటుంది. క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ తొమ్మిది రకాల పోస్టులు కనిపిస్తాయి. ఇక్కడ ఉంటే న్యూ రిజిస్ట్రేషన్ (OTPR) పక్కన ఉండే లింక్ పై క్లిక్ చేయాలి.
  • ముందుగా మీ ప్రాథమిక వివరాలతో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాలి.
  • నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. ఓసీ / బీసీ అభ్యర్థులు: రూ.600, ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / మాజీ సైనికులు / దివ్యాంగులు (PWD): రూ.400 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • ఫొటో, సంతకంతో పాటు సంబంధిత విద్యా అర్హత పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • చివరగా సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మీ రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

విద్యా అర్హతలు, వయోపరిమితులు, ఇతర వివరాలను https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకు చూడొచ్చు. ఖాళీల వారీగా పోస్టుల వివరాలను చూస్తే ఈ కింద విధంగా ఉన్నాయి….

  • ఆఫీస్‌ సబార్డినేట్‌: 319
  • స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3: 35
  • జూనియర్ అసిస్టెంట్‌: 159
  • టైపిస్ట్‌: 42
  • ఫీల్డ్‌ అసిస్టెంట్‌: 61
  • ఎగ్జామినర్‌: 49
  • కాపిస్ట్‌: 63
  • రికార్డ్‌ అసిస్టెంట్‌: 36
  • ప్రాసెస్‌ సర్వర్‌: 95

ఈ లింక్ పై క్లిక్ చేసి కోర్డు ఉద్యోగాలకు నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More