హౌసింగ్ బోర్డు బంపర్ ఆఫర్ - తక్కువ ధరకే సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్..! రేట్లు, దరఖాస్తు విధానం ఇలా…
రాష్ట్ర హౌసింగ్ బోర్డు శుభవార్త ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
రాష్ట్రంలోని ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్న హౌసింగ్ బోర్డు… మరో శుభవార్తతో ముందుకొచ్చింది. ప్రత్యేకంగా ఎల్ఐజీ వర్గాల (లోయర్ ఇన్ కమ్ గ్రూప్) కోసం ఫ్లాట్లను (Flats) అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లోని మొత్తం 339 ఫ్లాట్లను అందుబాటులోని ధరలతో విక్రయిస్తోంది.

అల్పాదాయ వర్గాల ప్రజలకు (ఎల్ఐజీ) మంచి వసతులతో కూడిన సొంత ఇంటి వసతిని కల్పించాలన్న ఉద్దేశ్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే అనేక కుటుంబాలు నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ - అపార్ట్ మెంట్ లలోని ఫ్లాట్లను ఆ వర్గాలకు చెందిన వారికే కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన…. అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ఫ్లాట్లే అని చెప్పారు.
బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలతోనే విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు. వివిధ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో హౌసింగ్ బోర్టు వీటిని నిర్మించాయని పేర్కొన్నారు. ఏడాదికి ఆరు లక్షల రూపాయల (నెలకు రూ.50 వేలు ) ఆదాయం ఉన్న వారికే వీటిని కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఎక్కడెక్కడంటే…?
- హైదరాబాద్ గచ్చిబౌలి లోని 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్ మెంట్ లో 102 నూ, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్ వద్ద 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
- వీటిని కొనుగోలు చేయడానికి దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకమైన విధానంలో లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు.
- ఫ్లాట్ల విస్తీర్ణం 450 చదరపు అడుగుల నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉంటుంది.
- గచ్చి బౌలి ప్రాంతంలోని ఫ్లాట్ల ధర రూ.26 లక్షల నుంచి గరిష్టంగా 36.20 లక్షల వరకు మాత్రమే ఉంది.
- ఇక ఖమ్మం, వరంగల్ లో రూ.19 -21.50 లక్షలకు, ఖమ్మంలో రూ.11.25 లక్షలకే అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రాంతాల్లోని ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ లోనూ, మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. గచ్చిబౌలి ప్రాంతం ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ జనవరి 6వ తేదీన, వరంగల్ లోని ఫ్లాట్ల కేటాయింపు జనవరి 8న, ఖమ్మం ఫ్లాట్ల లాటరీ జనవరి 10 వ తేదీన నిర్వహిస్తారు. ఈ విక్రయాలకు సంబధించిన వివరాలన్నీ కూడా హౌసింగ్ బోర్డు వెబ్ సైట్ https://tghb.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

