తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన నమూనా హాల్ టికెట్లను(ప్రివ్యూ) కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితంగా ఏమైనా తప్పులు దొర్లితే సవరించుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించింది.

ఇక ఈ 15 రోజులలోపే విద్యార్థులకు సంబంధించిన తుది హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాక్టికల్ సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే కాలేజీలకు చేరాయి. ఆన్ లైన్ లోనూ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచేలా సాఫ్ట్ వేర్ ను కూడా సిద్ధం చేశారు. మొత్తంగా చూస్తే ఈ నెలాఖారులోపు ఇంటర్ హాల్ టికెట్లు విద్యార్థులకు అందే అవకాశం ఉంది.
ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే..?
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:
- 25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
- 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
- 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
- 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
- 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
- 17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
- 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
- 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
- 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
- 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
- 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
- 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
- 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
- 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1