Telangana Inter Supplementary Exams 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. మే 13 నుంచి జరిగే ఈ పరీక్షల కోసం…. ఇంటర్ బోర్డు ఏర్పాట్లను పూర్తి చేసింది. జనరల్, ఒకేషనల్ విభాగాలకు చెందిన మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు మే 21 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 పరీక్షా కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేసింది.
ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే (మొదటి సంవత్సరం వారు ఉదయం 8:00 కి, రెండో సంవత్సరం వారు మధ్యాహ్నం 1:30 కి) కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 3,98,358 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం - 2,67,285 మంది విద్యార్థులు. రెండో సంవత్సరం - 1,31,073 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 10,685 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పరీక్షల పర్యవేక్షణలో పాల్గొంటారు.
ముఖ్యమైన సూచనలు:
- విద్యార్థులు కాలేజీ లాగిన్ ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్‌తో పరీక్షకు అనుమతిస్తారు.
- సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా హాల్లోకి అనుమతించరు.
- మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బోర్డు హెచ్చరించింది.
- పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, వైద్య సహాయం (నర్సు/ANM) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
- నిఘా కోసం ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
- పరీక్షల సమయంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థుల కోసం 'టెలీ-మానస్' (Tele-MANAS) సేవలు అందుబాటులో ఉన్నాయి. సహాయం కోసం 14416 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.
పరీక్షల షెడ్యూల్ వివరాలు
- మే 13: సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-I & II)
- మే 14: ఇంగ్లీష్ (పేపర్-I అండ్ II)
- మే 15: మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ / మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- మే 16: మ్యాథ్స్-1B, జువాలజీ, హిస్టరీ / మ్యాథ్స్-2B, జువాలజీ, హిస్టరీ
- మే 18: ఫిజిక్స్, ఎకనామిక్స్ (పేపర్-I & II)
- మే 19: కెమిస్ట్రీ, కామర్స్ (పేపర్-I & II)
- మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (BiPC విద్యార్థులకు)
- మే 21: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ (పేపర్-I & II)