TG Inter Admissions 2026 : తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే?

TG Inter 1st Year Admissions 2026 : తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్మీడియట్ విద్యామండలి పొడిగించింది. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల నేపథ్యంలో జూలై 31 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.

Published on: Jul 2, 2026, 15:06:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG Inter 1st Year Admissions 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ వచ్చింది. ప్రథమ సంవత్సర అడ్మిషన్ల గడువును ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కో-ఆపరేటివ్, గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ గడువు వర్తిస్తుంది.

తెలంగాణ ఇంటర్ ప్రవేశాలు 2026
తెలంగాణ ఇంటర్ ప్రవేశాలు 2026

గడువు పొడిగింపు…

మొదటి విడత అడ్మిషన్ల గడువు మంగళవారంతోనే ముగిసిపోయింది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు…. ఈ గడువును నెలాఖరు వరకు అవకాశం కల్పించారు.

ఇటీవల పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఇంటర్‌లో చేరాల్సి ఉంది. వీరందరికీ తాజా నిర్ణయంతో కాలేజీల్లో దరఖాస్తు చేసుకునేందుకు తగిన సమయం దొరికినట్లయింది.

మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెకండ్ బోర్డ్ పదో తరగతి ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఈ బోర్డు విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ విద్యా విధానంలోకి మారేందుకు వీలుగా అడ్మిషన్ల ప్రక్రియను జూలై చివరి వరకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఎలాంటి హడావుడి లేకుండా విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపుల్లో, నచ్చిన కళాశాలల్లో ప్రవేశాలు పొందే వీలుంది. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.

ఇంటర్ ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు హెచ్చరించింది. కేవలం టెన్త్ క్లాస్ జీపీఏ (GPA) మరియు సబ్జెక్టుల వారీగా వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే సీట్లు కేటాయించాలి. నిబంధనలు అతిక్రమిస్తే సదరు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అలాగే.... ప్రైవేట్ కళాశాలలు ఒక్కో సెక్షన్‌కు కేవలం 88 మందిని మాత్రమే చేర్చుకోవాలని, బోర్డు అనుమతించిన సెక్షన్ల కంటే అదనంగా విద్యార్థులను చేర్చుకుంటే గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో ఒక కీలక మార్పును ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల ముప్పును అరికట్టడానికి, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా 'యాంటీ డ్రగ్ అఫిడవిట్' సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థుల భద్రత, ముఖ్యంగా బాలికల రక్షణ కోసం ప్రిన్సిపాల్స్ తగిన చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More