TG LAWCET 2026 Results : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ (TG LAWCET), పీజీ లాసెట్ (TS PGLCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా చూసుకోవచ్చు.

{{^htLoading}} {{/htLoading}}
రాష్ట్రవ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో చేరాలనే లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. లాసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటించనుంది. అర్హత సాధించిన విద్యార్థులకు వారి ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు.
టీజీ లాసెట్ 2026 - ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా :
- అభ్యర్థులు మొదటగా తెలంగాణ లాసెట్ అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
- హోంపేజీలో కనిపించే 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ లాసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరుచుకోవడం మంచిది.
ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ లాసెట్ 2026 ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}