TG LAWCET 2026 Results : జూన్ 4వ తేదీన టీజీ లాసెట్ ఫలితాలు.. ఏ టైమ్‌కి విడుదల చేస్తారు?

TG LAWCET 2026 : తెలంగాణలో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్. రాష్టంలో నిర్వహించిన టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ - 2026 (TG LAWCET & PGLCET-2026) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది.

Updated on: Jun 03, 2026 1:10 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలను గురువారం(జూన్ 4) మధ్యాహ్నం 4 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగే ఒక ప్రత్యేక సమావేశంలో టీజీసీహెచ్‌ఈ (TGCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం కలిసి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

తెలంగాణ లాసెట్ ఫలితాలు
తెలంగాణ లాసెట్ ఫలితాలు

ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేసుకోవాలి?

ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు క్రింది సాధారణ పద్ధతులను అనుసరించి తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

  • మొదటగా అభ్యర్థులు తెలంగాణ లాసెట్ అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'TG LAWCET & PGLCET - 2026 Results' లేదా 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ లాసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' లేదా 'Get Rank Card' బటన్‌పై క్లిక్ చేయాలి.మీ స్క్రీన్‌పై ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తులో కౌన్సిలింగ్ ప్రక్రియ కోసం ఈ ర్యాంక్ కార్డ్‌ను ప్రింట్ అవుట్ తీసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి.

తెలంగాణ వ్యాప్తంగా మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది పరీక్షల కోసం భారీగా దరఖాస్తులు రాగా, అందులో దాదాపు 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసినట్లు అంచనా.

ఫలితాల విడుదలతో పాటు ర్యాంకులను కూడా అధికారులు వెల్లడిస్తారు. ఈ ఫలితాలలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ లేదా జులై నెలలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

అభ్యర్థులు తాజా అప్‌డేట్ల కోసం అధికారిక పోర్టల్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలి. టీజీ లాసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More