TG LAWCET 2026 Results : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇక్కడ చెక్ చేసుకోండి

TG Lawcet 206 Results : తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Jun 4, 2026, 15:58:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG LAWCET 2026 Results : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ (TG LAWCET), పీజీ లాసెట్ (TS PGLCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా చూసుకోవచ్చు.

టీజీ లాసెట్ ఫలితాలు 2026 (image istock)
టీజీ లాసెట్ ఫలితాలు 2026 (image istock)

రాష్ట్రవ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో చేరాలనే లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. లాసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటించనుంది. అర్హత సాధించిన విద్యార్థులకు వారి ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు.

టీజీ లాసెట్ 2026 - ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా :

  1. అభ్యర్థులు మొదటగా తెలంగాణ లాసెట్ అధికారిక వెబ్‌సైట్‌ https://lawcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
  2. హోంపేజీలో కనిపించే 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. ఆ తర్వాత మీ లాసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  5. భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరుచుకోవడం మంచిది.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ లాసెట్ 2026 ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More