...
...
Next Story

Telangana Meeseva : ఇకపై నో రిసిప్ట్....! మీసేవా కేంద్రాల్లో కొత్త రూల్స్, వీటిని తెలుసుకోండి

TG Meeseva digital receipt Rules : తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో భౌతిక రసీదుల జారీని పూర్తిగా నిలిపివేయనున్నారు. జూన్ 19 నుంచి దరఖాస్తుదారులకు కేవలం మొబైల్ ఫోన్‌లకే డిజిటల్ రసీదుల లింక్ పంపించనున్నారు.

Published on: Jun 18, 2026, 16:16:43 IST
Advertisement

TG Meeseva digital receipt Rules : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల ద్వారా వివిధ రకాల ప్రభుత్వ సేవలు పొందే దరఖాస్తుదారులకు ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మీసేవా కేంద్రాల్లో ఇప్పటివరకు దరఖాస్తుదారులకు అందజేస్తున్న కాగితపు (భౌతిక) రసీదుల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయనున్నారు.

మీ సేవ సేవల్లో మార్పులు
మీ సేవ సేవల్లో మార్పులు

డిజిటల్ సేవలను మరింతగా ప్రోత్సహించడంతో పాటు కాగితం వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 (శుక్రవారం) నుంచి రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో కాగితపు రసీదుల జారీని పూర్తిగా బంద్ చేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇకపై మీసేవా కేంద్రాల్లో ఎవరైనా ఏ సర్వీసు కోసమైనా దరఖాస్తు చేసుకుంటే, వారికి ఎలాంటి ప్రింటెడ్ రసీదు ఇవ్వరు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే, దరఖాస్తుదారుడి మొబైల్ ఫోన్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ (SMS) రూపంలో ఒక డిజిటల్ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ రసీదు లింకు వస్తుంది. ఆ లింకుపై క్లిక్ చేయగానే స్క్రీన్‌పై పూర్తి వివరాలతో కూడిన రసీదు కనిపిస్తుంది. అవసరమైన వారు దానిని మొబైల్‌లోనే సేవ్ చేసుకోవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కీలకంగా మొబైల్ నంబర్

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, ప్రజలు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే సమయంలో పనిచేసే మొబైల్ నంబర్‌ను మాత్రమే నమోదు చేయాలని అధికారులు సూచించారు. తప్పుడు నంబర్లు ఇస్తే రసీదు లింక్ అందే అవకాశం ఉండదు. అయితే….. ఒకవేళ ఫోన్‌కు వచ్చిన మెసేజ్ పొరపాటున డిలీట్ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సదరు దరఖాస్తుదారుడు మళ్లీ మీసేవ కేంద్రాన్ని సంప్రదిస్తే, సదరు మెసేజ్‌ను తిరిగి మొబైల్‌కు పంపించే (రీసెంట్) సౌకర్యాన్ని కూడా అధికారులు కల్పించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe