...
...
Next Story

TG Model School Hall Tickets : తెలంగాణ మోడల్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల - ఎగ్జామ్ తేదీ, డౌన్లోడ్ లింక్ వివరాలు

Telangana Model School Hall Tickets 2026 : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. telanganams.cgg.gov.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏప్రిల్ 19వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Published on: Apr 10, 2026, 14:53:37 IST
Advertisement

TG Model School Hall Tickets 2026 : తెలంగాణ మోడల్‌ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఆరో తరగతి ఎంట్రెన్స్ తో పాటు 7వ తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు సంబంధించి హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

తెలంగాణ మోడల్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ మోడల్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

నోటిఫికేషన్ ద్వారా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది.

మోడల్ స్కూల్ ఎగ్జామ్ హాల్ టికెట్ - ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. ముందుగా https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని ఆరో తరగతి, 7 నుంచి 10వ తరగతి నోటిఫికేషన్ల చివరిలో హాల్ టికెట్ లింక్ ఉంటుంది.
  3. అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీ లేదా మొబైల్ నెంబర్, అభ్యర్థి పేరు వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

ఏప్రిల్ 19న ఎంట్రెన్స్ టెస్ట్…

ఏప్రిల్ 19న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 జరగనుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్-మీడియం విద్యను అందించడానికి ఈ మోడల్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలు 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రాష్ట్ర సిలబస్‌తో పనిచేస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe