TG Muncipal Election Result Live Updates : మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ - పార్టీల వారీగా ఫలితాలు ఇలా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో పాగా వేసింది. మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలోనూ సత్తా చాటింది. కొన్నిచోట్ల మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అనుకున్నంత స్థాయిలో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది.
- {{^htLoading}}
{{/htLoading}}
- 13 Feb 2026, 06:12:11 PM IST
మాకు ఓటు శాతం పెరిగింది - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
మున్సిపల్ ఎన్నికల్లో 250 వార్డులను గెలుచుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చెప్పారు. గతంలో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో సగం కూడా గెలవలేదన్నారు. మేం ప్రతిపక్షంగానే ఉంటామని… ఏ పార్టీకి సపోర్ట్ చేయమని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు శాతం పెరిగిందని… వార్డులు కూడా గెలిచామన్నారు.
- 13 Feb 2026, 05:39:39 PM IST
ములుగులో కాంగ్రెస్ విక్టరీ
ములుగు మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. మొత్తం 20 వార్డులకు గాను 12 వార్డులను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 05:33:44 PM IST
కేటీఆర్ రియాక్షన్
“2581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా 30 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినామా అంటే గెలిచినట్లు కాంగ్రెస్ గెలిచింది” అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.
- 13 Feb 2026, 05:23:18 PM IST
ప్రియాంక గాంధీ అభినందనలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై ఎంపీ ప్రియాంక గాంధీ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 04:48:28 PM IST
ప్రజా పాలనకు పట్టం కట్టారు - డిప్యూటీ సీఎం భట్టి
ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారిందన్నారు. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని వ్యాఖ్యానించారు.
- 13 Feb 2026, 04:46:06 PM IST
జగిత్యాలలో ఇండిపెండెట్ల హవా..!
జగిత్యాల మున్సిపాలిటీలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్ 12, బీజేపీ 4, బీఆర్ఎస్ 4 చోట్ల గెలిచింది. అయితే 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విక్టరీ కొట్టారు. వీరంతా కూడా జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వారుగా ఉన్నారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 04:40:21 PM IST
నల్గొండ కార్పొరేషన్ కైవసం
నల్గొండ కార్పొరేషన్‌లోని మొత్తం 48 డివిజన్లకు కాంగ్రెస్ 27 గెలిచింది. బీఆర్ఎస్-9, బీజేపీ-4, AIFB-4, మజ్లిస్-2, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థికే అవకాశం రానుంది.
- 13 Feb 2026, 04:39:48 PM IST
రామగుండంలోనూ హస్తం హవా…
రామగుండం కార్పొరేషన్‍లో 60 డివిజన్లకు గాను 34 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. అందులో 22 వార్డులలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరికొన్ని డివిజన్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 04:39:29 PM IST
మంచిర్యాలలోనూ కాంగ్రెస్
మంచిర్యాల కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లలో విజయం సాధించి మరో మూడింట్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
- 13 Feb 2026, 04:39:19 PM IST
కరీంనగర్ లో బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్‍లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ఎక్కువ డివిజన్లలో బీజేపీ లీడ్ లో ఉంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 04:39:07 PM IST
కొత్తగూడెంలో సీపీఐ
కొత్తగూడెం కార్పొరేషన్ ను సీపీఐ కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో మొత్తం 47 డివిజన్లు ఉండగా… సీపీఐ 25, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు.
- 13 Feb 2026, 04:29:22 PM IST
బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు
ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, ఇంద్రేశం, గుమ్మడిదలలో వికర్టీ కొట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ, మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీలను గెలుచుకుంది. అంతేకాకుండా మూడుచింతలపల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోగా.. జర్వేల్ లో కూడా విక్టరీ కొట్టింది. కల్వకుర్తి నియోజకరవర్గంలోని ఆమనగల్లులో కూడా విజయం సాధించింది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 04:09:01 PM IST
90 స్థానాల్లో కాంగ్రెస్ పాగా
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. 12 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితమైంది. మరో 12 మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇక బీజేపీ ఒకే మున్సిపాలిటీకి పరిమితమైంది. భైంసాలో ఎంఐఎం అత్యధిక వార్డులు గెలిచింది.
- 13 Feb 2026, 04:05:53 PM IST
ఇస్నాపూర్‌లో టెన్షన్ టెన్షన్…
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ కోసం 2 సీట్ల దూరంలో బీఆర్ఎస్, 4 సీట్ల దూరంలో కాంగ్రెస్ ఉంది. స్వతంత్ర అభ్యర్థులను కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాంపులకు తరలించేందుకు రెండు పార్టీల యత్నిస్తున్నాయి.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 03:47:17 PM IST
430 వార్డుల్లో ముందంజలో ఉన్న కాంగ్రెస్
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 430 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ 222 వార్డుల్లో ముందంజలో ఉండగా, భారతీయ జనతా పార్టీ (BJP) 61 వార్డుల్లో లీడ్‌లో ఉండి మూడో స్థానంలో నిలిచింది. ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులు 59 వార్డుల్లో ప్రభావం చూపుతున్నట్లు ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థ నివేదించింది.
- 13 Feb 2026, 03:45:39 PM IST
పలు చోట్ల ఉద్రిక్తతలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 37 చోట్ల హస్తం పార్టీ జయకేతనం ఎగురవేయగా.. బీఆర్ఎస్ 7 స్థానాలకే పరిమితమైంది. కరీంనగర్, సంగారెడ్డిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 03:04:10 PM IST
ఆమనగల్ లో గులాబీ జెండా
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డులకు గాను బీఆర్ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 1 వార్డుల్లో గెలుపొందింది.
- 13 Feb 2026, 02:41:48 PM IST
తెలంగాణ మున్సిపాలిటీల ఫలితాలు
2582 వార్డులకు గానూ మధ్యాహ్నం 2 గంటల వరకు 1965 వార్డుల్లో ఫలితాలు వచ్చాయి. వీటిల్లో కాంగ్రెస్ 1040, బీఆర్ఎస్ 562, బీజేపీ 181, స్వతంత్రులు 182 చోట్ల గెలిచారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 02:40:25 PM IST
కరీంనగర్ సిటీలో బీజేపీ హవా…!
కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా బీజేపీ-23, కాంగ్రెస్-14, మజ్లిస్-5, బీఆర్ఎస్-4, ఇతరులు 4 చోట్ల గెలిచారు.
- 13 Feb 2026, 02:31:25 PM IST
వర్ధన్నపేటలో హంగ్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మొత్తం 12 వార్డుల్లో 6 వార్డుల్లో బీఆర్ఎస్, 5 వార్డుల్లో కాంగ్రెస్, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 02:22:39 PM IST
జనగామలో హోరాహోరీ
జనగామ మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మొత్తం 30 వార్డుల్లో ఇరు పార్టీలు చెరో 13 స్థానాలు గెలుచుకోగా, నలుగురు స్వతంత్రులు కింగ్ మేకర్లుగా మారారు. 15వ వార్డు నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ రెబెల్ ఇండిపెండెంట్ అభ్యర్థి పాండు గెలుపొందారు. ముగ్గురు ఇండిపెండెంట్‌లు తనతోనే ఉన్నారని…. తమలో ఒకరికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని పాండు డిమాండ్ చేశారు.
- 13 Feb 2026, 01:59:40 PM IST
సూర్యాపేటలో కాంగ్రెస్
సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 48 వార్డులలో కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 10, ఇండిపెండెంట్ 6, బీజేపీ ఒక చోట గెలిచింది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 01:12:20 PM IST
జహీరాబాద్ లో హంగ్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో హంగ్ నెలకొంది.మొత్తం 37 వార్డులకు గాను 15 వార్డుల్లో బీఆర్ఎస్, 14 వార్డుల్లో కాంగ్రెస్ నెగ్గింది. 3 వార్డుల్లో బీజేపీ, 2 వార్డుల్లో ఎంఐఎం, 3 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.
- 13 Feb 2026, 01:01:59 PM IST
సిరిసిల్లలో బీఆర్ఎస్ విక్టరీ
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. 39 వార్డులకు 27 వార్డులు కైవసం చేసుకుంది. 6 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీజేపీ, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 01:00:05 PM IST
ఇబ్రహీంపట్నం కారుదే…
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు గాను 13 వార్డుల్లో బీఆర్ఎస్, 8 వార్డుల్లో కాంగ్రెస్, 2 వార్డుల్లో బీజేపీ విక్టరీ కొట్టింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు.
- 13 Feb 2026, 12:53:06 PM IST
వడ్డేపల్లిలో జాగృతి
జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. ఈ పార్టీ తరపున తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ 8 చోట్ల జాగృతి అభ్యర్థులు గెలవగా…వడ్డేపల్లి వారి ఖాతాలోకే వెళ్లినట్లు అయింది. కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 12:50:53 PM IST
బాన్సువాడ మున్సిపాలిటీ - ఫలితాలు
1వ వార్డు - బీఆర్ఎస్ - నసీన్ బేగం
2వ వార్డు - కాంగ్రెస్ - జంగం రాజశేఖర్
3వ వార్డు - కాంగ్రెస్ - హకీమ్
4వ వార్డు - కాంగ్రెస్ - రుక్మిణి
5వ వార్డు - కాంగ్రెస్ - కాసుల విజయ
6వ వార్డు - బీఆర్ఎస్ - అంజుమన్ బేగం
7వ వార్డు - బీజేపీ - మానస శ్రీకాంత్
8వ వార్డు - కాంగ్రెస్ శ్యామల వెంకట్
9వ వార్డు - బీజేపీ పాశం ఆమని భాస్కర్
10వ వార్డు - కాంగ్రెస్ నగేష్
11వ వార్డు - కాంగ్రెస్ - లింగమేశ్వర్
12వ వార్డు - ఇండిపెండెంట్ అభ్యర్థి అంజా గౌడ్
13వ వార్డు - కాంగ్రెస్ - కాలేక్
14వ వార్డు - కాంగ్రెస్ - వసంత
15వ వార్డు - కాంగ్రెస్ - వంకరి రమేష్
16వ వార్డు - బీజేపీ - గజ్జల మహేష్
17వ వార్డు - MIM ఫార్విన్ బేగం
18వ వార్డు - కాంగ్రెస్ - రేష్మ బేగం
19వ వార్డు - బీఆర్ఎస్ - మక్బుల్
మొత్తం - కాంగ్రెస్ పార్టీ 11, బీఆర్ఎస్ పార్టీ 3, బిజెపి 3, MIM - 1, ఇండిపెండెంట్ - 1
- 13 Feb 2026, 12:49:35 PM IST
కాంగ్రెస్ విజయం
పెద్దపల్లి, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. .. మేడ్చల్ అలియాబాద్ కూడా కాంగ్రెస్ సొంతమైంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 12:14:03 PM IST
దుబ్బాకలో కారు జోరు
దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. 20వార్డులకు గాను 10 చోట్ల బిఆర్ఎస్ గెలవగా… బిజెపి ఒకటి దక్కించుకుంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు.
- 13 Feb 2026, 12:13:14 PM IST
ఇబ్రహీంపట్నం ఫలితాలు ఇలా
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా… 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 4, 5,11,14 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 12:00:31 PM IST
ట్రాన్స్‌జెండర్ విక్టరీ
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం నమోదైంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ సుధాకర్…. కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి జిట్ట నగేష్‌పై 102 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- 13 Feb 2026, 11:59:01 AM IST
కొన్నిచోట్ల హంగ్
జుక్కల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కోహీర్, అలంపూర్, కేసముద్రంలో హంగ్ నెలకొంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 11:45:49 AM IST
జనసేన బోణీ.
ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు.
- 13 Feb 2026, 11:40:32 AM IST
ర్యాలీలపై నిషేధం - వరంగల్ పోలీసులు
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజేతలు తమ సంబరాల కోసం మరో రోజును కేటాయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 11:30:01 AM IST
కాంగ్రెస్ జోరు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు తుది ఫలితాలు ప్రకటించిన మున్సిపాలిటీలు 18 ఉండగా.. 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది.
- 13 Feb 2026, 11:29:38 AM IST
కాంగ్రెస్ హవా
నల్గొండ జిల్లా హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న కాంగ్రెస్.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ, డోర్నకల్ మునిప్రాలిటీ కాంగ్రెస్ కైవసం.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకా మధిర మున్సిపాలిటీలో సైతం ఎగిరిన కాంగ్రెస్ జెండా.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 11:14:28 AM IST
తిరుమలగిరిలో BRS
తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డులకు గాను 8 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు.
- 13 Feb 2026, 10:56:33 AM IST
కారు పార్టీ ఖాతాలోకి అయిజ
జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 10:55:11 AM IST
నాగార్జునసాగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
1వ వార్డు – యాకిడి నాగ మల్లేశ్వరి (కాంగ్రెస్) – 225 మెజారిటీ
2వ వార్డు – నటువ నరేందర్ (కాంగ్రెస్) – 71 మెజారిటీ
3వ వార్డు – గూడపర్తి రాజా ప్రసాద్ (కాంగ్రెస్) – 314 మెజారిటీ
4వ వార్డు – మంద గౌతమి (కాంగ్రెస్) – 256 మెజారిటీ
5వ వార్డు – పాయర్డు బాబు రావు (కాంగ్రెస్) – 359 మెజారిటీ
6వ వార్డు – అంగోతు చందులాల్ (కాంగ్రెస్) – 247 మెజారిటీ
7వ వార్డు – మైలపల్లి జానకి (కాంగ్రెస్) – 342 మెజారిటీ
8వ వార్డు – నకిరేకంటి రమణ (బీఆర్ఎస్) – 129 మెజారిటీ
9వ వార్డు – ఇర్ల రామకృష్ణ (కాంగ్రెస్) – 399 మెజారిటీ
10వ వార్డు – వి. వినిషా (కాంగ్రెస్) – 361 మెజారిటీ
11వ వార్డు – పగడాల నాగరాజు (కాంగ్రెస్) – 295 మెజారిటీ
12వ వార్డు – స్వర్ణ మానస (కాంగ్రెస్) – 324 మెజారిటీ
- 13 Feb 2026, 10:54:06 AM IST
గుమ్మడిదలలో బీఆర్ఎస్
సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గుమ్మడిదలలో 22 వార్డులకు గాను 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 10:53:34 AM IST
4 మున్సిపాలిటీలు కైవసం
ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల మున్సిపాలిటీల్లోవిక్టరీ కొట్టింది.
- 13 Feb 2026, 10:30:50 AM IST
నారాయణపేట జిల్లా : మద్దూర్ మున్సిపాలిటీ (మొత్తం 16 వార్డులు)
1వ వార్డు – సభావాత్ సంగీత (కాంగ్రెస్ పార్టీ) గెలుపు
7వ వార్డు – పోలీస్ శ్రీలత (కాంగ్రెస్ పార్టీ) గెలుపు
8వ వార్డు – రెనివట్ల శీను (ఇండిపెండెంట్) గెలుపు
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 10:28:24 AM IST
కాంగ్రెస్ ఖాతాలోకి నందికొండ
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 వార్డులకు గానూ 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
- 13 Feb 2026, 10:26:15 AM IST
హుజురాబాద్ పోస్టల్ ఓట్లు
హుుజరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడయ్యాయి.
మొత్తం ఓట్లు (30 వార్డులు): 241
🔹 BRS – 69
🔹 కాంగ్రెస్ – 90
🔹 బీజేపీ – 58
🔹 ఇతరులు – 22
🔹 చెల్లనివి – 2
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 10:19:06 AM IST
ఇబ్రహీంపట్నంలో పోటాపోటీ
ఇబ్రహీంపట్నంలో పోటాపోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఒకటి బీజేపీ దక్కించుకోగా…. కాంగ్రెస్ నుండి రెబల్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానం లో విజయం సాధించారు.
కాంగ్రెస్ : 05 (2, 6, 8, 9, 10)
బిఆర్ఎస్ : (05) 4, 5, 7, 11, 12
బీజేపీ : (1) 1
ఇండిపెండెంట్ : (1) 3
- 13 Feb 2026, 10:12:56 AM IST
బీఆర్ఎస్ ఖాతాలో క్యాతనపల్లి మున్సిపాలిటీ
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మునిసిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 10:10:08 AM IST
మెదక్ మున్సిపాలిటీ - ఫలితాలు
1వ వార్డు – బీఆర్ఎస్
4వ వార్డు – బీఆర్ఎస్
10వ వార్డు – కాంగ్రెస్
19వ వార్డు – కాంగ్రెస్
25వ వార్డు – బీఆర్ఎస్
28వ వార్డు – బీజేపీ
31వ వార్డు – కాంగ్రెస్
- 13 Feb 2026, 10:09:27 AM IST
ఆలేరులో ఖాతా తెరిచిన బీఆర్ఎస్
ఆలేరు మున్సిపాలిటీలోని 1వ, 4వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
- {{^htLoading}}
{{/htLoading}} - 13 Feb 2026, 10:08:50 AM IST
అశ్వారావుపేటలో టఫ్ ఫైట్
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పోటాపోటీ ఉంది. 2 వార్డుల్లో బీఆర్ఎస్, 2 వార్డుల్లో కాంగ్రెస్, 1 వార్డులో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
- 13 Feb 2026, 10:04:48 AM IST
బీజేపీ అభ్యర్థి విజయం
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించారు.
- {{^htLoading}}
{{/htLoading}}