TG Muncipal Election Result Live Updates : మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ - పార్టీల వారీగా ఫలితాలు ఇలా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో పాగా వేసింది. మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలోనూ సత్తా చాటింది. కొన్నిచోట్ల మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అనుకున్నంత స్థాయిలో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది.
...Read Moreమంథనిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - కాంగ్రెస్ కు లీడ్
పెద్దపల్లి జిల్లా: మంథని మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు
1వ వార్డు:
కాంగ్రెస్ -6 , బీఆర్ఎస్-4
2వ వార్డు:
కాంగ్రెస్ - 1, బీఆర్ఎస్ - 1
3వ వార్డు:
కాంగ్రెస్ - 1, బీఆర్ఎస్ - 4, ఇండిపెండెంట్ - 1
4వ వార్డు: కాంగ్రెస్ -2,
6వ వార్డు: AIFB - 2
7వ వార్డు: కాంగ్రెస్ - 2
ఇండిపెండెంట్ - 4
8వ వార్డు - కాంగ్రెస్ - 2
9వ వార్డు - కాంగ్రెస్ -4, బీఆర్ఎస్ - 1
10వ వార్డు: కాంగ్రెస్ - 2
11 వ వార్డు: కాంగ్రెస్ -6, బీఆర్ఎస్ - 1
12వ వార్డు: కాంగ్రెస్ - 2
13 వ వార్డు: కాంగ్రెస్ - 2, బీఆర్ఎస్ -1
మొత్తం పోస్టల్ ఓట్లు: కాంగ్రెస్:30, బీఆర్ఎస్:12, AIFB : 2, ఇండిపెండెంట్: 5
మదిరలో ఖాతా తెరిచిన టీడీపీ
మధిర మున్సిపాలిటీలోని 10వ వార్డులో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు.
హుస్నాబాద్ లో కాంగ్రెస్ జోరు
హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4 5 6 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.
మున్సిపాలిటీ కైవసం
సంగారెడ్డి జిల్లా గడ్డ పొతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 10 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. ఒక చోట కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
పలు వార్డుల్లో కాంగ్రెస్
ములుగులోని 1, 4, 6 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. జగిత్యాలలోని 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ గెలుపొందారు.
పలుచోట్ల BRS అభ్యర్థులు…
మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన BRS అభ్యర్థి గురుక కుమార్.
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపు.
సంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం
ఖాతా తెరిచిన బీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపు
ఈనెల 16న మేయర్, ఛైర్మన్ల ఎన్నిక
ఈనెల 16న రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నారు.
పోస్టల్ ఓట్లు - ముందంజలో కాంగ్రెస్
ఆదిలాబాద్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సంగారెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లో 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా… జగిత్యాల పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది.
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
136 కేంద్రాల్ల కౌంటింగ్
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 136 ఓట్ల లెకింపు కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 లోపు తొలి ఫలితం రావొచ్చని తెలుస్తోంది.
ఫలితాలపై ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొటీ నెలకొంది. ప్రతి వార్డును కూడా సవాల్ గా తీసుకోగా…. మెజార్టీ స్థానాలు గెలిచిన పార్టీలు ఆయా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటాయి.
పోలింగ్ లెక్కలు ఇలా…
7 కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 శాతం అత్యధికంగా నమోదవ్వగా.. అత్యల్పంగా నందికొండలో 59.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో 77.36 శాతం, అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12 శాతం ఓట్లు పడ్డాయి. 72.63 శాతం పురుష ఓటర్లు, 73.39 శాతం మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ శాతం ఎంతంటే…
ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు తప్పా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.తుది పోలింగ్ శాతం 73.01గా ఎన్నికల సంఘం అంచనా వేసింది.
ఏజెంట్ల సంతకాలు తప్పనిసరి…
రౌండ్ వారీగా అభ్యర్థుల ఓట్లు మరియు తిరస్కరించబడిన ఓట్లను తుది ఫలిత పత్రంలో నమోదు చేస్తారు. ప్రతి రౌండ్ తర్వాత ఏజెంట్ల సంతకాలను తీసుకుంటారు. ఫలితాలు ప్రకటించబడతాయి.
ఏజెంట్ కు చూపిస్తూ లెక్కింపు…
ప్రతి ఓటును ఏజెంట్లకు చూపిస్తూ దాని చెల్లుబాటును నిర్ధారిస్తారు. సంబంధిత అభ్యర్థి ట్రేలో వేస్తారు. అభ్యర్థుల వారీగా వచ్చిన చెల్లుబాటయ్యే ఓట్లను 100 చొప్పున కట్టలుగా కడతారు. అలాగే నోటా, సందేహాస్పద ఓట్లను కూడా 100 చొప్పున బండిల్ చేస్తారు. వందకు తక్కువగా ఉన్న ఓట్లను విడిగా ఉంచి ఆ సంఖ్యను స్లిప్ పై రాస్తారు. సందేహాస్పద ఓట్లపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకుంటారు.
ఓట్ల లెక్కింపు ప్రాసెస్
ఒక వార్డులోని అన్ని బ్యాలెట్ పెట్టెలను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్ వద్దకు తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్ బ్యాలెట్ పత్రాలను 25 సెట్లలో బండిల్ చేస్తారు. మిగిలిపోయిన బ్యాలెట్లు 25 కంటే తక్కువగా ఉంటే…. వాటిని ప్రత్యేక బండిల్‌గా తయారు చేసి కౌంట్‌తో లేబుల్ చేస్తారు. పోలింగ్ స్టేషన్ల వివరాలు నమోదు చేసిన తర్వాత…. వార్డులోని అన్ని బ్యాలెట్ కట్టలను ఒక పెద్ద డ్రమ్ములో వేసి బాగా కలుపుతారు. దీనివల్ల ఏ పోలింగ్ స్టేషన్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియకుండా గోప్యత పాటించవచ్చు.
కొనసాగుతున్న పోస్టల్ ఓట్ల లెక్కింపు
మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడుతున్నారు. వీటి లెక్కింపు పూర్తి కాగానే సాధారణ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.
పట్టిష్ట ఏర్పాట్లు
కౌంటింగ్ హాల్ లోపలికి కేవలం సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు. స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ ప్రారంభం
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ షురూ అయింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు.పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు…. కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 (నిషేధాజ్ఞలు) అమలు చేస్తున్నారు.

E-Paper

