TG POLYCET 2026 : టీజీ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్ డౌన్లోడ్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
TG Polycet Seat Allotment 2026 : తెలంగాణ పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 9 లోగా ఆన్‌లైన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
TG Polycet Seat Allotment 2026 : తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలిసెట్) 2026 మొదటి విడత కౌన్సెలింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ విడతలో రిజిస్ట్రేషన్ చేసుకొని.. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి సీట్లను కేటాయించారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల విభాగం అధికారులు వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలు…
టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా సీటు పొందిన విద్యార్థులు జూన్ 9వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా అభ్యర్థులు జూన్ 8, జూన్ 9 తేదీల్లో తమకు సీటు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలలకు నేరుగా వెళ్లాలి. అక్కడ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, అడ్మిషన్ రిపోర్ట్‌ను అందజేయాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం (తరగతులు) జూన్ 9 నుంచే ప్రారంభం కానున్నాయి.
టీజీ పాలిసెట్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా:
- ముందుగా https://tgpolycet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని క్యాండెట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత… అలాట్ మెంట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
- దీనిపై క్లిక్ చేస్తే మీ అలాట్ మెంట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.
- కాలేజీలో రిపోర్టింగ్ చేయాలంటే అలాట్ మెంట్ అర్డర్ కాపీని తప్పనిసరిగా ఉండాలి.
టీజీ పాలిసెట్ మొదటి విడత సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై, జూన్ 22వ తేదీతో ముగుస్తుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా విద్యార్థులకు తమ బ్రాంచ్‌లను మార్చుకునేందుకు అధికారులు ఇంటర్నల్ స్లైడింగ్ (Internal Sliding) అవకాశం కల్పించారు. జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక కోర్సు నుంచి మరో కోర్సులోకి (ఉదాహరణకు మెకానికల్ బ్రాంచ్ నుంచి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు) మారడానికి వీలుంటుంది.
ఇక ఈ ప్రధాన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఏవైనా సీట్లు మిగిలిపోతే, వాటిని భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు ) నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
ఇటీవల విడుదలైన తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఎప్పటిలాగే బాలికలు 86.38 శాతంతో పైచేయి సాధించగా, బాలురు 79.92 శాతం ఉత్తీర్ణత పొందారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

