తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన వార్షిక అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం రూపొందించిన ఈ క్యాలెండర్‌లో తరగతుల నిర్వహణ, పరీక్షల తేదీలు, సెలవులు, పాఠ్యేతర ప్రణాళికలను విద్యాశాఖ స్పష్టంగా పొందుపరిచింది.

ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు మొత్తం 227 పనిదినాలపాటు నడవనున్నాయి. ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినం 2027 ఏప్రిల్ 23గా నిర్ణయించారు. ఆ తర్వాతి రోజు, అనగా 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయి.
పరీక్షల పూర్తి షెడ్యూల్
విద్యార్థుల ప్రగతిని అంచనా వేసేందుకు విద్యాశాఖ ఫార్మేటివ్ (FA), సమ్మేటివ్ (SA) పరీక్షల షెడ్యూల్‌ను కింది విధంగా ప్రకటించింది.
- ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 (FA-1): 2026 జూలై 31 లోపు పూర్తి చేయాలి.
- ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 (FA-2): సెప్టెంబర్ 21 లోపు నిర్వహించాలి.
- సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1): అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగుతాయి.
- ఫార్మేటివ్ అసెస్‌మెంట్-3 (FA-3): డిసెంబర్ 10 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఫార్మేటివ్ అసెస్‌మెంట్-4 (FA-4): పదో తరగతి విద్యార్థులకు 2027 జనవరి 27 లోపు, అలాగే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలి.
- పదో తరగతి ప్రీ-ఫైనల్స్: 2027 ఫిబ్రవరి 28 లోపు ముగుస్తాయి.
- పదో తరగతి బోర్డు పరీక్షలు (SSC Exams 2027): 2027 మార్చి నెలలో నిర్వహించనున్నారు.
- సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (SA-2): 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 2027 ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 19 వరకు జరుగుతాయి.
పండుగ సెలవుల వివరాలు
ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మూడు ప్రధాన పండుగ సెలవుల కాలాన్ని విద్యాశాఖ కేటాయించింది.
- దసరా సెలవులు: 2026 అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 22 వరకు (మొత్తం 13 రోజులు).
- క్రిస్మస్ సెలవులు: మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 27 వరకు.
- సంక్రాంతి సెలవులు: 2027 జనవరి 13 నుండి జనవరి 17 వరకు.
క్రీడలు, యోగా తప్పనిసరి
{{/usCountry}}ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మూడు ప్రధాన పండుగ సెలవుల కాలాన్ని విద్యాశాఖ కేటాయించింది.
- దసరా సెలవులు: 2026 అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 22 వరకు (మొత్తం 13 రోజులు).
- క్రిస్మస్ సెలవులు: మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 27 వరకు.
- సంక్రాంతి సెలవులు: 2027 జనవరి 13 నుండి జనవరి 17 వరకు.
క్రీడలు, యోగా తప్పనిసరి
{{/usCountry}}కేవలం చదువే కాకుండా విద్యార్థుల శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ పాఠశాలల్లో క్రీడా కార్యకలాపాలను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం ప్రార్థనా సమయం ముగిసిన తర్వాత లేదా అసెంబ్లీ సమయంలోనే రోజూ యోగా, ధ్యానం సెషన్లను నిర్వహించడం తప్పనిసరి చేశారు.
చదువులో వెనుకబడిన 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే రెమెడియల్ (సవరణ) తరగతులు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అన్ని ముఖ్యమైన దినోత్సవాలను పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని, తద్వారా విద్యార్థులకు సామాజిక స్పృహ కల్పించాలని స్పష్టం చేశారు.
కింద పీడీఎఫ్‌లో పూర్తి వివరాలు చూడండి.