...
...
Next Story

TG SET 2026 Syllabus : తెలంగాణ సెట్ - 2026 నోటిఫికేషన్ అప్డేట్ - సిలబస్ విడుదల, మీ సబ్జెక్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG SET 2026 Syllabus : తెలంగాణ సెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన సిలబస్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Published on: Aug 15, 2026, 18:35:48 IST
Advertisement

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఉద్దేశించిన 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG SET 2026) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్‌తో పాటు అభ్యర్థులకు అత్యంత కీలకమైన పరీక్ష సిలబస్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 29 సబ్జెక్టులకు సంబంధించిన సమగ్ర సిలబస్ కాపీలు అందుబాటులో ఉన్నాయి.

టీజీ సెట్ 2026 - ఇలా డౌన్లోడ్ చేసుకోండి :

  1. మొదటగా టీజీ సెట్ అధికారిక పోర్టల్ https://telanganaset.org/ ను సందర్శించాలి.
  2. హోమ్‌పేజీలో కనిపించే Syllabus అనే విభాగంపై క్లిక్ చేయాలి.
  3. అక్కడ ముందుగా పేపర్ – I (General Paper) అని కనిపిస్తుంది. దాని పక్కనే ఉండే Download బటన్‌పై క్లిక్ చేస్తే పేపర్-1 జనరల్ సిలబస్ డౌన్‌లోడ్ అవుతుంది.
  4. ఆ తర్వాత క్రింద పేపర్ – II (సబ్జెక్టులు) జాబితా కనిపిస్తుంది.
  5. అందులో అందుబాటులో ఉన్న 29 సబ్జెక్టుల పేర్లలో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఎదురుగా ఉన్న డౌన్లోడ్ ఆప్షన్‌ను ఎంచుకుని సిలబస్ కాపీని పొంది, ప్రింట్ తీసుకోవచ్చు.

పరీక్షా విధానం – మార్కుల కేటాయింపు

  • పేపర్–1 : ఇది అందరికీ ఉమ్మడిగా ఉండే జనరల్ పేపర్. ఇందులో ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు ఉంటాయి. అభ్యర్థుల బోధనా నైపుణ్యం (Teaching Aptitude), పరిశోధనా దృక్పథం (Research Aptitude), తార్కిక ఆలోచనా సామర్థ్యం (Logical Reasoning), గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ఈ ప్రశ్నలు రూపుదిద్దుకుంటాయి.
  • పేపర్–2 : ఇది అభ్యర్థి ఎంచుకున్న సంబంధిత సబ్జెక్టుపై ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహాలోనే 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులు ఉంటాయి.

తెలంగాణ సెట్ సిలబస్
తెలంగాణ సెట్ సిలబస్

అభ్యర్థులు ఎలాంటి అదనపు ఆలస్య రుసుము (Late Fee) లేకుండా ఆగస్టు 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయలేని వారికి వివిధ విడతల్లో ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు:

  • రూ. 1500 ఆలస్య రుసుముతో: ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు.
  • రూ. 2000 ఆలస్య రుసుముతో: సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
  • రూ. 3000 ఆలస్య రుసుముతో: సెప్టెంబర్ 11, 12 తేదీల్లో చివరి అవకాశం కల్పించారు.
  • దరఖాస్తు సవరణ (Edit Option): దరఖాస్తులో ఏవైనా తప్పులుంటే దిద్దుకోవడానికి సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
  • హాల్ టికెట్ల డౌన్లోడ్ : సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను పొందవచ్చు.
  • పరీక్షల నిర్వహణ: సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
  • అధికారిక వెబ్‌సైట్: https://telanganaset.org/

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe