ఈ ఏడాది తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ లోటు వర్షపాతంతో ముగిసింది. ఎందుకంటే నైరుతి రుతుపవన వర్షాలు ముగిశాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 27 వరకు సాధారణంగా నమోదు కావాల్సిన 726.7 మిమీ వర్షపాతానికి గాను కేవలం 615.3 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రంలో సగటున 15 శాతం వర్షపాతం తగ్గింది. రాబోయే రెండు వారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. అయితే ఈ నాలుగు నెలల కాలంలో ఏ ఒక్క నెలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరుసగా అన్ని నెలల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్ నినో పరిస్థితుల వల్లే రుతుపవనాలు బలహీనపడ్డాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
గత సంవత్సరం మొత్తం వర్షపాతం 977.5 మిమీ.. ఈ సంవత్సరం 615.3 మిమీగా ఉంది. 15 నుంచి 20 శాతం మధ్యలో లోటుగా ఉంది. ఐఎమ్‌డీ ఢిల్లీ అందించిన లెక్కల ప్రకారం సెప్టెంబర్ 23 నాటికే రాష్ట్రంలో కేవలం 558.6 మిమీ వర్షపాతం నమోదైంది (సాధారణం 702.6 మిమీ). ఈ గణాంకాల ఆధారంగా లోటు ఏకంగా 20 శాతానికి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం దాదాపు 37 శాతం పడిపోవడం గమనార్హం. అయితే ఇటీవల పడిన వానలతో లోటు వర్షపాతంలో మార్పు వచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పరిస్థితులను పరిశీలిస్తే, 17 జిల్లాలు సాధారణ వర్షపాత పరిధిలోకి రాగా.. మిగిలిన 16 జిల్లాలు తీవ్రమైన లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి.
అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైన జిల్లాలు.. జోగులాంబ గద్వాల: 39 శాతం లోటు, హనుమకొండ 34 శాతం, నల్గొండ 32 శాతం, వరంగల్ 31 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 31 శాతం,
{{/usCountry}}అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైన జిల్లాలు.. జోగులాంబ గద్వాల: 39 శాతం లోటు, హనుమకొండ 34 శాతం, నల్గొండ 32 శాతం, వరంగల్ 31 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 31 శాతం,
{{/usCountry}}హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలోనూ వానల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఈ సీజన్‌లో 604.7 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 456.6 మిమీ మాత్రమే కురిసింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడన వ్యవస్థలు లేకపోవడంతో నైరుతి రుతుపవనాలు త్వరలోనే ముగియనున్నాయి. రుతుపవనాల నిష్క్రమణ వేగవంతం కావడంతో రాబోయే రోజుల్లో వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు.