టాటా చెప్పిన నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలో 15 శాతం లోటు వర్షపాతం!
southwest monsoon 2026 : నైరుతి రుతుపవన వర్షాలు ముగిశాయి. ఈ ఏడాది వానలు నిరాశే మిగిల్చాయి. తెలంగాణలో లోటు వర్షపాతం నమోదైంది.
ఈ ఏడాది తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ లోటు వర్షపాతంతో ముగిసింది. ఎందుకంటే నైరుతి రుతుపవన వర్షాలు ముగిశాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 27 వరకు సాధారణంగా నమోదు కావాల్సిన 726.7 మిమీ వర్షపాతానికి గాను కేవలం 615.3 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రంలో సగటున 15 శాతం వర్షపాతం తగ్గింది. రాబోయే రెండు వారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. అయితే ఈ నాలుగు నెలల కాలంలో ఏ ఒక్క నెలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరుసగా అన్ని నెలల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్ నినో పరిస్థితుల వల్లే రుతుపవనాలు బలహీనపడ్డాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
గత సంవత్సరం మొత్తం వర్షపాతం 977.5 మిమీ.. ఈ సంవత్సరం 615.3 మిమీగా ఉంది. 15 నుంచి 20 శాతం మధ్యలో లోటుగా ఉంది. ఐఎమ్‌డీ ఢిల్లీ అందించిన లెక్కల ప్రకారం సెప్టెంబర్ 23 నాటికే రాష్ట్రంలో కేవలం 558.6 మిమీ వర్షపాతం నమోదైంది (సాధారణం 702.6 మిమీ). ఈ గణాంకాల ఆధారంగా లోటు ఏకంగా 20 శాతానికి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం దాదాపు 37 శాతం పడిపోవడం గమనార్హం. అయితే ఇటీవల పడిన వానలతో లోటు వర్షపాతంలో మార్పు వచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పరిస్థితులను పరిశీలిస్తే, 17 జిల్లాలు సాధారణ వర్షపాత పరిధిలోకి రాగా.. మిగిలిన 16 జిల్లాలు తీవ్రమైన లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి.
అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైన జిల్లాలు.. జోగులాంబ గద్వాల: 39 శాతం లోటు, హనుమకొండ 34 శాతం, నల్గొండ 32 శాతం, వరంగల్ 31 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 31 శాతం,
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలోనూ వానల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఈ సీజన్‌లో 604.7 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 456.6 మిమీ మాత్రమే కురిసింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడన వ్యవస్థలు లేకపోవడంతో నైరుతి రుతుపవనాలు త్వరలోనే ముగియనున్నాయి. రుతుపవనాల నిష్క్రమణ వేగవంతం కావడంతో రాబోయే రోజుల్లో వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


