Telangana Special TET Results : రాష్ట్రంలో నిర్వహించిన 'తెలంగాణ స్పెషల్ టెట్' పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన ఇన్ సర్వీస్ టీచర్ అభ్యర్థులు తమ ఫలితాలను, సాధించిన మార్కుల స్కోర్ కార్డును విద్యాశాఖకు చెందిన అధికారిక పోర్టల్ ద్వారా వెంటనే తనిఖీ చేసుకోవచ్చు.

ఫలితాల కోసం అభ్యర్థులు https://tgtet.aptonline.in/UI/ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. లాగిన్ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను, అర్హత సాధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
- ముందుగా తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/UI/ కు వెళ్లాలి.
- హోమ్‌పేజీలో కనిపిస్తున్న "Special TET Results / Score Card" లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్, పేపర్ ను ఎంచుకోవాలి.
- ప్రింట్ మార్క్ మెమోపై క్లిక్ చేస్తే మీ స్కోర్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా స్కోర్ కార్డు కాపీని పొందొచ్చు.
- భవిష్యత్తు అవసరాల కోసం ఆ స్కోర్ కార్డును ప్రింటవుట్ లేదా పిడిఎఫ్ రూపంలో భద్రపరుచుకోవాలి.
ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ప్రత్యేత టెట్‌కు మొత్తం 22,477 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
టీచర్ నియామకాలపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై RTE, NCTE, UGC చట్టాల ప్రకారం నిర్దేశించిన అర్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించకూడదని.. అలాగే ఉద్యోగంలో కొనసాగించకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.