TG 10th Class Results Live : తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. బాలికలదే హవా

Apr 29, 2026, 14:20:41 IST

Telangana SSC 10th class Results 2026 Live Updates : తెలంగాణ టెన్త్ ఫలితాలు - 2026 విడుదల అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి..? సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడుంటాయి..? వంటి తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు…

Summary

మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు పదో తరగతి ఫలితాలు వెలువడుతాయి.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 (istock image)
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 (istock image)
Follow all the updates here:
  • 29 Apr 2026, 02:20:41 PM IST

    సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తేదీలు

    ఎస్ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 05.06.2026 నుంచి 12.06.2026 వరకు జరుగుతాయి. అయితే అభ్యర్థులు పరీక్ష ఫీజను సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించడానికి గడువు తేదీని 14.05.2026గా నిర్ణయించారు. హెడ్‌మాస్టర్లు ఈఎన్ఆర్‌ను ఆన్‌లైన్ ద్వారా డీఈవోకు సమర్పించడానికి చివరి తేదీ 15.05.2026గా ఉంది. డీఈఓలు ఈఎన్ఆర్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఆన్‌లైన్ ద్వారా సమర్పించడానికి గడువు తేదీ 16.05.2026గా ఉంది. రూ.50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్ట్ పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు చెల్లించవచ్చు.

  • 29 Apr 2026, 02:14:29 PM IST

    బాలికలదే హవా

    తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలది హవా కొనసాగింది. మెుత్తం ఉత్తీర్ణత శాతం చూసుకుంటే.. 95.15 శాతంగా ఉంది. బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 96.26 శాతంగా ఉన్నారు. ఈసారి కూడా బాలికలదే హవా కొనసాగింది.

  • 29 Apr 2026, 02:11:50 PM IST

    సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే

    తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల కోసం నిర్వహించే ఎస్ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 05.06.2026 నుంచి 12.06.2026 వరకు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు.

  • 29 Apr 2026, 02:02:00 PM IST

    పదో తరగతి ఫలితాలు విడుదల

    తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లలోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • 29 Apr 2026, 01:37:10 PM IST

    మరికొన్ని నిమిషాల్లో పదో తరగతి ఫలితాలు

    విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి ఫలితాలు మరికొన్ని నిమిషాల్లో వచ్చేస్తాయి. మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి.

  • 29 Apr 2026, 01:31:54 PM IST

    TS SSC Results 2026: ఫలితాల చెకింగ్ స్టెప్స్

    వెబ్‌సైట్లలో ఏదో ఒకటి ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో కనిపించే "SSC Public Examinations March 2026 Results" అనే లింక్‌పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ నొక్కితే ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకోవడం లేదా పిడిఎఫ్ (PDF) ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవడం మంచిది.

  • 29 Apr 2026, 01:31:06 PM IST

    TS SSC Results 2026: ఫలితాలు చూసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్లు

    వెబ్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలనుకునే వారు కింద పేర్కొన్న ఏదైనా ఒక లింక్‌ను ఉపయోగించవచ్చు. సర్వర్ సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం వేర్వేరు వెబ్‌సైట్లను అందుబాటులో ఉంచింది:

    https://results.bsetelangana.org

    https://results.bse.telangana.gov.in

  • 29 Apr 2026, 01:20:52 PM IST

    మీసేవ వాట్సాప్ ద్వారా ఫలితాలు (కొత్త ఫీచర్)

    సాధారణంగా ఫలితాలు విడుదలైన మొదటి గంటలో లక్షలాది మంది వెబ్‌సైట్లను సందర్శిస్తారు. దీనివల్ల సైట్ లోడ్ అవ్వడానికి సమయం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు విద్యాశాఖ 'మీసేవ వాట్సాప్' (MeeSeva WhatsApp) సేవను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు తమ మొబైల్ నుంచి 8096958096 అనే నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. అవసరమైన వివరాలు (హాల్ టికెట్ నంబర్ వంటివి) ఎంటర్ చేస్తే నేరుగా మీ వాట్సాప్‌కే ఫలితాలు వచ్చేస్తాయి.

  • 29 Apr 2026, 01:19:04 PM IST

    TS SSC Results 2026: కుంగిపోవాల్సిన పనిలేదు

    TS SSC Results 2026: పదో తరగతి ఫలితాలు అనేవి మీ కెరీర్‌లో ఒక మైలురాయి మాత్రమే, అదే అంతిమ గమ్యం కాదు. ఆశించిన మార్కులు రాకపోయినా లేదా ఒక సబ్జెక్టులో తప్పినా కుంగిపోవాల్సిన పనిలేదు. ప్రభుత్వం త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేస్తుంది. విద్యార్థులు తమ తదుపరి లక్ష్యంపై దృష్టి సారించి, తమకు నచ్చిన కోర్సులను ఎంచుకోవడంలో తల్లిదండ్రుల సహకారం తీసుకోవడం ఉత్తమం.

  • 29 Apr 2026, 01:17:40 PM IST

    SSC 2026 ఫలితాలు విడుదల చేయనున్న కె.కేశవరావు

    తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ పాల్గొంటారు.

  • 29 Apr 2026, 01:15:46 PM IST

    Telangana SSC 10th class Results 2026: మరికాసేపట్లో ఎస్సెస్సీ ఫలితాలు

    తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం (SSC Board) మార్చి 2026లో నిర్వహించిన పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ రోజు, అంటే ఏప్రిల్ 29, 2026న మధ్యాహ్నం 2:00 గంటలకు విడుదల చేయనుంది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్, ఎల్‌బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎస్సీఈఆర్టీ (SCERT) క్యాంపస్ లోని గోదావరి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సౌలభ్యం కోసం కేవలం వెబ్‌సైట్లు మాత్రమే కాకుండా, ఈసారి మరిన్ని డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

  • 29 Apr 2026, 12:36:42 PM IST

    Telangana SSC 10th class Results 2026: మీ సేవ వాట్సాప్ నెంబర్ ఇదే

    ఎస్సెస్సీ పరీక్షల ఫలితాలను మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా పొందవచ్చు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో సమన్వయంతో మీ సేవ ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

  • 29 Apr 2026, 12:32:00 PM IST

    Telangana SSC 10th class Results 2026: రిజల్ట్స్ లింక్స్ ఇవే

    https://www.hindustantimes.com/education/board-exams/telangana-board-ts-ssc-class-10th-result , https://www.livehindustan.com/career/results/appView/telangana-board-10th-result , https://results.bsetelangana.org , https://results.bse.telangana.gov.in , https://bse.telangana.gov.in , https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.

  • 29 Apr 2026, 12:08:27 PM IST

    Telangana SSC 10th class Results 2026: మరి కాసేపట్లో తెలంగాణ ఎస్సెస్సీ ఫలితాలు

    ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్, లైవ్ హిందుస్తాన్ వెబ్‌సైట్లలో చూడొచ్చు. లింక్స్: https://www.hindustantimes.com/education/board-exams/telangana-board-ts-ssc-class-10th-result , https://www.livehindustan.com/career/results/appView/telangana-board-10th-result

  • 29 Apr 2026, 11:35:31 AM IST

    Telangana SSC 10th class Results 2026: లైవ్ హిందుస్తాన్‌లో ఎస్సెస్సీ ఫలితాలు 2026

    తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 లైవ్ హిందుస్తాన్ వెబ్‌సైట్లోనూ లభ్యమవుతాయి. వెబ్ సైట్ లింక్: https://www.livehindustan.com/career/results/appView/telangana-board-10th-result

  • 29 Apr 2026, 11:20:22 AM IST

    HT వెబ్ సైట్ లో టెన్త్ ఫలితాలు

    గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ https://www.hindustantimes.com/education/board-exams/telangana-board-ts-ssc-class-10th-result లోనూ తెలంగాణ పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.

  • 29 Apr 2026, 11:19:41 AM IST

    వాట్సాప్ లో ఫలితాలు - నెంబర్ ఇదిగో

    పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా సులభంగా ఫలితాలను పొందవచ్చు. దీనివల్ల వెబ్‌సైట్లలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా…. వేగంగా, అత్యంత సులభంగా ఫలితాలను పొందవచ్చు. ఈ సేవను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో సమన్వయంతో మీ సేవ ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

  • 29 Apr 2026, 10:55:58 AM IST

    గతేడాది ఉత్తీర్ణత శాతం ఎంతంటే..?

    గతేడాది తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

  • 29 Apr 2026, 10:54:39 AM IST

    గతేడాది ఫలితాలు

    గతేడాది పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ 99.29 శాతంతో అగ్రస్థానం సాధించింది. వికారాబాద్ 73.97 శాతం చివరి స్థానంలో ఉంది. మొత్తం 33 జిల్లాల్లో 4,96,374 మంది పరీక్షలకు హాజరవ్వగా...4,60,519 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,28,608 మంది బాలురు, 2,31,911 మంది బాలుకలు ఉత్తీర్ణత సాధించారు.

  • 29 Apr 2026, 10:40:58 AM IST

    రిజల్ట్ లింక్స్

    తెలంగాణ పదో తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా మాత్రమే కాకుండా ప్రభుత్వ వెబ్ సైట్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఆ లింక్స్ ఇక్కడ ఉన్నాయి…

    https://results.bsetelangana.org

    https://results.bse.telangana.gov.in

    https://bse.telangana.gov.in

    https://schooledu.telangana.gov.in

  • 29 Apr 2026, 10:05:00 AM IST

    వాట్సాప్ లో టెన్త్ ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే..?

    1. మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకోండి.

    2. WhatsApp ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి.

    3. “SSC Result” అని టైప్ చేయండి.

    4. మెనులో ఓపెన్ సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయండి.

    5. మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.

    6. వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో WhatsAppలో డిస్ ప్లే అవుతుంది.

  • 29 Apr 2026, 09:58:38 AM IST

    మరికొన్ని గంటల్లోనే ఫలితాలు

    తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు రిజీల్ అవుతాయి.

  • 29 Apr 2026, 09:25:34 AM IST

    2 గంటలకు ఫలితాలు

    పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. 2 గంటలకు ఎస్‌సీఈఆర్టీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు వీటిని విడుదల చేయనున్నారు. ఈసారి పదోతరగతి పరీక్షలను మార్చి-14 నుంచి ఈనెల 16వరకు సుదీర్ఘంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 5.28 లక్షల మంది హాజరయ్యారు.

  • 29 Apr 2026, 09:04:31 AM IST

    5 లక్షల మంది రెగ్యూలర్ విద్యార్థులు

    రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీ నాటికే పేపర్ల దిద్దుబాటు ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.

  • 29 Apr 2026, 08:24:33 AM IST

    టెన్త్ ఫలితాలు - ముఖ్యమైన లింక్స్

    ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు అందుబాటులో వస్తాయి. ముఖ్యమైన లింక్స్ ఇవే

    https://results.bsetelangana.org

    https://results.bse.telangana.gov.in

    https://bse.telangana.gov.in

    https://schooledu.telangana.gov

    వాట్సాప్ నెంబర్ - 8096958096

    హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ - https://www.hindustantimes.com/

  • 29 Apr 2026, 08:22:38 AM IST

    ఫలితాల కోసం ఎదురుచూపులు

    తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంతో పోల్చితే ఈసారి పరీక్షలకు కూడా ప్రభుత్వం చాలా ఎక్కువ సమయం ఇచ్చింది. ఒత్తిడికి గురికావొద్దన్న ఉద్దేశ్యంతో ఈ సమయం ఇచ్చారు.

  • 29 Apr 2026, 07:55:47 AM IST

    ఫలితాల తర్వాత సప్లిమెంటరీ తేదీలు

    తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత…. సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటిస్తారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ను విడుదల చేస్తారు.

  • 29 Apr 2026, 06:43:50 AM IST

    5 లక్షలపైగా విద్యార్థులు

    పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 13తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్‌ 23వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది.

  • 29 Apr 2026, 06:40:09 AM IST

    వాట్సాప్ లో ఫలితాలు - ప్రభుత్వం ప్రకటన

    పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా సులభంగా తమ ఫలితాలను పొందవచ్చు. దీనివల్ల వెబ్‌సైట్లలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా…. వేగంగా, అత్యంత సులభంగా ఫలితాలను పొందవచ్చు. ఈ సేవను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో సమన్వయంతో మీ సేవ ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

  • 29 Apr 2026, 06:39:37 AM IST

    2 గంటలకు ఫలితాలు

    ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదలవుతాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

  • 28 Apr 2026, 11:13:52 PM IST

    తెలంగాణ టెన్త్ ఫలితాల లింక్స్

    ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున… ప్రభుత్వం ఒకేసారి నాలుగు అధికారిక పోర్టల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా తమ ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు:

    https://results.bsetelangana.org

    https://results.bse.telangana.gov.in

    https://bse.telangana.gov.in

    https://schooledu.telangana.gov.in

  • 28 Apr 2026, 11:11:03 PM IST

    వాట్సాప్ లో టెన్త్ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోవాలి

    ముందుగా మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.

    వాట్సాప్‌లో ఈ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.

    అడిగిన వివరాలను (హాల్ టికెట్ నంబర్) అందిస్తే, మీ మార్కుల మెమో నేరుగా వాట్సాప్‌లోనే ప్రత్యక్షమవుతుంది.

  • 28 Apr 2026, 11:10:43 PM IST

    వాట్సాప్ లోనూ ఫలితాలు

    వెబ్‌సైట్లలో సర్వర్ సమస్యలు తలెత్తినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం మీ సేవ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కేవలం ఒక 'Hi' తో మీ ఫలితాలు ఫోన్లోకి వచ్చేస్తాయి.

  • 28 Apr 2026, 11:10:15 PM IST

    టీజీ టెన్త్ ఫలితాలు - ప్రభుత్వ వెబ్ సైట్ లింక్స్

  • 28 Apr 2026, 11:07:38 PM IST

    ఇలా చెక్ చేసుకోండి

    మొదట అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.cgg.gov.in సందర్శించండి.

    హోమ్ పేజీలో కనిపించే 'TS SSC Results 2026' లింక్‌పై క్లిక్ చేయండి.

    మీ హాల్ టికెట్ నంబర్‌ను తప్పులు లేకుండా నమోదు చేయండి.

    'Submit' బటన్‌పై క్లిక్ చేయగానే మీ మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

    భవిష్యత్తు అవసరాల కోసం మీ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవడం ఉత్తమం.

  • 28 Apr 2026, 11:06:59 PM IST

    హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ లోనూ ఫలితాలు

    గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.

  • 28 Apr 2026, 11:06:40 PM IST

    ఫలితాలు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

    తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ లేదా results.cgg.gov.in వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు.

  • 28 Apr 2026, 11:06:11 PM IST

    వేగంగా స్పాట్ వాల్యూయేషన్

    పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీ నాటికే పేపర్ల దిద్దుబాటు ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మార్కుల నమోదు, క్రోడీకరణ ప్రక్రియను కూడా వేగంగా నిర్వహించి….. ఫలితాలను సిద్ధం చేసింది.

  • 28 Apr 2026, 11:05:51 PM IST

    5 లక్షలకుపైగా విద్యార్థులు

    రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

  • 28 Apr 2026, 11:05:35 PM IST

    ముందుగానే ఫలితాలు

    మొదట మే మొదటి వారంలో ఫలితాలు వస్తాయని భావించినప్పటికీ… ముందుగానే ఫలితాలు రానున్నాయి. స్పాట్ వాల్యూయేషన్ తో పాటు ఇతర ప్రక్రియలు వేగంగా పూర్తి కావటంతో ఏప్రిల్ 29వ తేదీని ఖరారు చేశారు.

  • 28 Apr 2026, 11:05:01 PM IST

    నేడే టెన్త్ ఫలితాలు

    ఇవాళ తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలవుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు సిద్ధం చేసింది.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe