...
...
Next Story

సర్పంచ్ ఎన్నికలు : ఈసీ నుంచి కొత్త అప్డేట్ - 'టీ-పోల్ మొబైల్ యాప్' ప్రారంభం, ఇవిగో వివరాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఈసీ మొబైల్ యాప్ ను ప్రారంభించింది. Te-Poll మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు,సందేహాలు, ఫిర్యాదుల స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు.

Published on: Nov 27, 2025, 18:44:08 IST
Advertisement

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. గురువారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఎన్నకల ప్రక్రియను సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ యాప్ ను కూడా ప్రారంభించింది.

ప్రత్యేకంగా యాప్…

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈసీ Te-Poll Mobile యాప్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయటమే కాకుండా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.

ఓటర్లు తమ ఓటరు స్లిప్ మరియు పోలింగ్ స్టేషన్ వివరాలను డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది. యాప్ ఉపయోగించి ఫిర్యాదులను అప్ లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

' టీ-పోల్ మొబైల్ యాప్'ను ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను కమిషన్ నవంబర్ 25న ప్రకటించింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించగా… ఇవాళ్టి నుంచి మొదటి విడత నామినేషన్లను స్వీకరిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks