కేవలం రూ.550కే ‘హైదరాబాద్ సిటీ టూర్’ ప్యాకేజీ - ఒక్క రోజులోనే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!
హైదరాబాద్లోని ఫేమస్ ప్లేసులను ఒక్కరోజులోనే చూడాలనుకుంటున్నారా..? మీకోసం తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. చాలా తక్కువ టికెట్ ధరతోనే ఆపరేట్ చేయనుంది. ముఖ్యమైన వివరాలను ఈ కథనలో తెలుసుకోండి…..
ఒక్క రోజులోనే హైదరాబాద్లోని ఫేమస్ ప్లేసులను చూడాలనుకుంటున్నారా…? అతి తక్కువ టికెట్ ధరతోనే ఈ అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. టూరిస్టుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. సిటీ మొత్తం కవర్ చేసేలా ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ టూర్ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బిర్లా మందిర్, చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్లో షాపింగ్ సహా ఇతర ప్రదేశాలు ఎంజాయ్ చేయవచ్చు. నిజాం జూబ్లీ పెవిలియన్, గొల్కోండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ కవర్ అవుతాయి. ఏసీ, నాన్ఏసీ బస్సుల ద్వారా ప్రయాణం ఉంటుంది. https://tgtdc.in/ వెబ్ సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.
జర్నీ షెడ్యూల్ వివరాలు….
- ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట యాత్రి నివాస్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది.
- 7:45 గంటలకు పర్యాటక భవన్ దగ్గర ఎక్కొచ్చు.
- 8:15 గంటలకు బషీర్‌బాగ్ CRO ఆఫీస్ దగ్గర కూడా బోర్డింగ్ పాయింట్ ఉంటుంది.
- ముందుగా బిర్లా మందిర్ ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత చౌమహాల్లా ప్యాలెస్(శుక్రవారం ఉండదు), చార్మినార్, మక్కా మసీద్ సందర్శిస్తారు. లడ్ బజార్ లో షాపింగ్ చేసుకోవచ్చు.
- ఆ తర్వాత సలార్ జంగ్ మ్యూజియం వెళ్తారు. శుక్రవారం మాత్రం క్లోజ్ ఉంటుంది. అక్కడ్నుంచి నిజాం జూబ్లీ పెవిలియన్ వెళ్తారు. అక్కడ్నుంచి జూపార్క్ సందర్శిస్తారు.
- గొల్కోండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూంబ్స్ చూస్తారు.
- చివరగా ఐమ్యాక్స్(ఖైరతాబాద్) మీదుగా చివరగా లుంబినీ పార్క్ దగ్గర రాత్రి 7:30 గంటలకు వదిలేస్తారు. దీంతో మీ వన్ డే ట్రిప్ పూర్తవుతుంది.
హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్ ధరలు చూస్తే…. రెగ్యూలర్ ఛార్జీలు(ఏసీ కోచ్) అయితే పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.440గా నిర్ణయించారు. బోటింగ్ అయితే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫుడ్, సందర్శన స్థలాల వద్ద ఎంట్రీ టికెట్లు టూరిస్టులే తీసుకోవాలి. నియమ, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

