తెలంగాణలోని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త తెల్ల రేషన్ కార్డుల (White Ration Cards) జారీ ప్రక్రియకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను అర్హులకు అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ పంపిణీ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని అర్హులకు కొత్త కార్డులను పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ లబ్ధిదారులకు కార్డుల అందజేత కార్యక్రమం ఒకేసారి కొనసాగుతుంది.
రాష్ట్రంలో అర్హత కలిగిన ఏ ఒక్క పేద కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 కోట్ల మంది అర్హులకు నూతన తెల్ల రేషన్ కార్డులు అందనున్నాయి.
దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఎటువంటి వివక్ష లేకుండా కార్డు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెల్ల రేషన్ కార్డు ద్వారా ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ఇళ్ల నిర్మాణం వంటి పలు ఇతర సంక్షేమ పథకాలకు కూడా మార్గం సుగమం కానుంది.
ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర హర్షం వ్యక్తమవుతోంది. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అర్హుల జాబితాను రూపొందించే పనిలో యంత్రాంగం వేగంగా నిమగ్నమైంది.
{{/usCountry}}ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర హర్షం వ్యక్తమవుతోంది. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అర్హుల జాబితాను రూపొందించే పనిలో యంత్రాంగం వేగంగా నిమగ్నమైంది.
{{/usCountry}}'ప్రతిష్ఠాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. పేద కుటుంబాల ఆహార భద్రతకు బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. సంక్షేమ పాలనలో రేషన్ కార్డులో పంపిణీలో మరో కీలక మైలురాయి. తెలంగాణలో రేషన్ కార్డులు ఆన్‌లైన్‌లో అలాట్ అయ్యాయి. ఫిజికల్‌గా చాలా మందికి కార్డులు రాలేదు. ఆగస్టు 15 నుంచి నియోజకవర్గాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.' అని మంత్రి ఉత్తమ్ చెప్పారు.