White Ration Card : కొత్త రేషన్ కార్డుల పంపిణీ డేట్ ఫిక్స్.. ఒకేసారి 119 నియోజకవర్గాల్లో

White Ration Card : తెలంగాణ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. 119 నియోజకవర్గాల్లో తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తేదీని ప్రకటించింది. దీంతో పేదలకు లబ్ధిచేకూరనుంది.

Published on: Aug 6, 2026, 13:32:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త తెల్ల రేషన్ కార్డుల (White Ration Cards) జారీ ప్రక్రియకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను అర్హులకు అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

రేషన్ కార్డుల పంపిణీ
రేషన్ కార్డుల పంపిణీ

మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ పంపిణీ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని అర్హులకు కొత్త కార్డులను పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ లబ్ధిదారులకు కార్డుల అందజేత కార్యక్రమం ఒకేసారి కొనసాగుతుంది.

రాష్ట్రంలో అర్హత కలిగిన ఏ ఒక్క పేద కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 కోట్ల మంది అర్హులకు నూతన తెల్ల రేషన్ కార్డులు అందనున్నాయి.

దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఎటువంటి వివక్ష లేకుండా కార్డు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెల్ల రేషన్ కార్డు ద్వారా ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ఇళ్ల నిర్మాణం వంటి పలు ఇతర సంక్షేమ పథకాలకు కూడా మార్గం సుగమం కానుంది.

ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర హర్షం వ్యక్తమవుతోంది. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అర్హుల జాబితాను రూపొందించే పనిలో యంత్రాంగం వేగంగా నిమగ్నమైంది.

'ప్రతిష్ఠాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. పేద కుటుంబాల ఆహార భద్రతకు బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. సంక్షేమ పాలనలో రేషన్ కార్డులో పంపిణీలో మరో కీలక మైలురాయి. తెలంగాణలో రేషన్ కార్డులు ఆన్‌లైన్‌లో అలాట్ అయ్యాయి. ఫిజికల్‌గా చాలా మందికి కార్డులు రాలేదు. ఆగస్టు 15 నుంచి నియోజకవర్గాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.' అని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More