చలి చంపేస్తోంది బాబోయ్! తెలంగాణ వ్యాప్తంగా మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

ఐఎండీ హైదరాబాద్ తెలంగాణకు చలిగాలుల హెచ్చరికను పొడిగించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Published on: Dec 11, 2025, 06:49:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని బుధవారం నుండి ఉష్ణోగ్రత మరింత తగ్గుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)-హైదరాబాద్, ప్రైవేట్ వాతావరణ ట్రాకర్లు రాబోయే వారంలో తీవ్రమైన చలిగాలుల పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఐఎండీ హైదరాబాద్ తెలంగాణలోని పలు జిల్లాలకు చలిగాలుల హెచ్చరికను మరో రెండు రోజులు పొడిగించింది.

తెలంగాణలో పడిపోనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పడిపోనున్న ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్ , కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో సహా అనేక ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది .

ఐఎండీ హైదరాబాద్ జారీ చేసిన తీవ్రమైన చలిగాలుల హెచ్చరిక శుక్రవారం, డిసెంబర్ 12, 2025 వరకు కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత మరికొన్ని రోజులు కూడా తీవ్రమైన చలి ఉండనుంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, మెదక్, భువనగిరితో సహా పరిసర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.

హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రైవేట్ వాతావరణ ట్రాకర్లు వెదర్ రిపోర్ట్ అంచనా వేశారు. బుధవారం రాత్రి నుండి తెలంగాణ అంతటా చలిగాలులు, తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గవచ్చని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన చలిగాలులు రాబోయే 4 నుండి 5 రోజుల వరకు కొనసాగుతాయని అన్నారు.

హైదరాబాద్, చుట్టుపక్కల అనేక ప్రాంతాలలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శివార్లలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లో) మొయినాబాద్ (6.6), ఇబ్రహీంపట్నం (7.7), శేరిలింగంపల్లి (8.4), రాజేంద్రనగర్ (9.2), మౌలాలి (9.4), బిహెచ్‌ఇఎల్ (10.5), గచ్చిబౌలి (11.4), కుత్బుల్లాపూర్ (11.9) లలో ఉన్నాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ నుంచి 13 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More