రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీగెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2 విడతలు పూర్తి కాగా… తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

ఆన్ లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 1లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అర్హులైన వివరాలను నవంబర్ 2వ తేదీన ప్రకటిస్తారు. నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. నవంబర్ 5వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవాలి.
నవంబర్ 9వ తేదీన అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ఫైనల్ ఫేజ్ కింద సీట్లు పొందే విద్యార్థులు…. నవంబర్ 11వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. నిర్దేశించిన టైమ్ లోపు రిపోర్టింగ్ చేయకపోతే… సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…
- అర్హులైన అభ్యర్థులు... https://cpget.ouadmissions.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని అప్లయ్ ఆన్ లైన్ వెరిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా లాగిన్ వివరాలను క్రియేట్ చేసుకోవాలి.
- కౌన్సెలింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 250, SC/ST/PH అభ్యర్థులురూ. 200 చెల్లించాలి.
- మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
- అలాట్ మెంట్ కాపీని కూడా ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఉస్మానియా యూనివర్శిటీనే ఈ ప్రవేశ బాధ్యతలను చూస్తోంది.
{{/usCountry}}ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఉస్మానియా యూనివర్శిటీనే ఈ ప్రవేశ బాధ్యతలను చూస్తోంది.
{{/usCountry}}