...
...
Next Story

TG CPGET Counselling 2025 : సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

టీజీ సీపీగెట్ - 2025 సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 24లోపు రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. https://cpget.ouadmissions.com/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.

Published on: Oct 22, 2025 06:06 PM IST
Advertisement

రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీగెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ప్రక్రియ పూర్తి కాగా… తాజా సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించారు. రెండో విడత కింద 11,289 మందికి సీట్లను కేటాయించారు.

అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  • అభ్యర్థులు https://cpget.ouadmissions.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని క్యాండెంట్ అలాట్ మెంట్ లాగిన్ - 2 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

టీజీ సీపీగెట్ సీట్ల కేటాయింపు 2025
టీజీ సీపీగెట్ సీట్ల కేటాయింపు 2025

సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 24వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe