AP EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అప్డేట్ - ఇవాళే సీట్ల కేటాయింపు, అలాట్‌మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఏపీఈఏపీసెట్ - 2025 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే వెబ్ ఆప్షన్లు పూర్తి కాగా… ఇవాళ విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. అలాట్ మెంట్ కాపీని https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
ఏపీఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ - 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు పూర్తి చేశారు. వీరంతా కూడా సీట్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరికి ఇవాళ(అక్టోబర్ 21) సీట్లను కేటాయించనున్నారు.

ఈ కౌన్సెలింగ్ లో భాగంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, పుడ్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
సీట్లు పొందే విద్యార్థులు అక్టోబర్ 24వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. మరోవైపు ఈనెల 21వ తేదీ నుంచే ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
అలాట్ మెంట్ కాపీ డౌన్లోడ్ ప్రాసెస్ :
- విద్యార్థులు https://eapcet-sche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే సీటు అలాట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీకు కేటాయించిన కాలేజీ వివరాలతో కూడిన అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందాలి.
- కాలేజీ అడ్మిషన్ ప్రాసెస్ లో అలాట్ మెంట్ కాపీ చాలా కీలకం.
ఇక ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఈనెల 29 వరకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలను https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/ వెబ్ సైట్ లో చూడొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

