రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న TG CPGET 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పీజీ కోర్సుల్లో చేరడానికి చివరి అవకాశమైన ఈ విడత కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు.

ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థుల సర్టిఫికేట్ల ఆన్‌లైన్ పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అధికారుల సమయం కేటాయించారు. అర్హత ఉన్న విద్యార్థులు అక్టోబర్ 09, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ స్పష్టం చేసింది.
ముఖ్యమైన తేదీలు – పూర్తి వివరాలు:
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల పరిశీలన: అక్టోబర్ 09, 2026 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు: అక్టోబర్ 10, 2026 వరకు
- వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్ ఆప్షన్): అక్టోబర్ 10, 2026
- ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలు: అక్టోబర్ 14, 2026
- సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్: అక్టోబర్ 17, 2026 వరకు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ వరకు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసేటప్పుడు విద్యార్థులు ఏవైనా పొరపాట్లు చేస్తే…. వాటిని సరిదిద్దుకోవడానికి లేదా సవరించుకోవడానికి అదే రోజు (అక్టోబర్ 10న) ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ విండోను అందుబాటులో ఉంచుతున్నారు.
ఈనెల 14న సీట్ల కేటాయింపు…
అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్లు, మెరిట్ ఆధారంగా ఫైనల్ ఫేజ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్) ఫలితాలను అక్టోబర్ 14, 2026న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు అలోట్‌మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని, అక్టోబర్ 17వ తేదీలోగా తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
పీజీ ప్రవేశాలకు సంబంధించిన తదుపరి సమాచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://cpgetadmissions.com/ ను సందర్శిస్తూ ఉండాలని సీపీగెట్ కన్వీనర్ సూచించారు. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారిక నోటిఫికేషన్లోని వివరాలను సరిచూసుకోవాలని స్పష్టం చేశారు.
{{/usCountry}}పీజీ ప్రవేశాలకు సంబంధించిన తదుపరి సమాచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://cpgetadmissions.com/ ను సందర్శిస్తూ ఉండాలని సీపీగెట్ కన్వీనర్ సూచించారు. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారిక నోటిఫికేషన్లోని వివరాలను సరిచూసుకోవాలని స్పష్టం చేశారు.
{{/usCountry}}