రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. టీజీ సీపీగెట్ (TG CPGET-2026) చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు షురూ అవుతాయి.
టీజీ సీపీగెట్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు
- అభ్యర్థుల సర్టిఫికేట్ల ఆన్‌లైన్ పరిశీలన కోసం నమోదు (రిజిస్ట్రేషన్) ప్రక్రియ 06-10-2026 నుంచి ప్రారంభమై 09-10-2026 వరకు కొనసాగుతుంది.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
- ఒకవేళ వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా సవరణలు చేసుకోవాలనుకుంటే, అభ్యర్థుల కోసం అక్టోబర్ 10వ తేదీన ఎడిట్ ఆప్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
- ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులకు ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్) ఫలితాలను అక్టోబర్ 14, 2026న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

టీజీ సీపీగెట్ - 2026 ఫైనల్ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో అక్టోబర్ 17వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశించిన సమయంలోపు రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
పీజీ ప్రవేశాలకు సంబంధించిన తదుపరి తాజా సమాచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://cpgetadmissions.com/ ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సీపీగెట్ కన్వీనర్ సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఇదే వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. అలాట్ మెంట్ కాపీలను కూడా ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.