TG CPGET 2026 Counselling : టీజీ సీపీగెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలు ఇవే!
TG CPGET 2026 Phase 2Counselling : తెలంగాణ టీజీ సీపీగెట్ 2026 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 22 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
TG CPGET 2026 Phase 2Counselling : తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పిజి, పిజి డిప్లొమా, ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్-2026 (TG CPGET 2026) రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు లేదా సీటు సాధించలేకపోయిన వారు ఈ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనొచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cpgetadmissions.com ను సందర్శించి వివరాలు నమోదు చేసుకోవాలి.

సీపీగెట్ రెండో విడత కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ : మొదటి విడతలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 26 వరకు ఆన్‌లైన్ ఫీజు చెల్లించి ఒరిజినల్ సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- సర్టిఫికేట్ల పరిశీలన, సవరణలు: అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ 27న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఏవైనా తప్పులు ఉంటే ఈ-మెయిల్ ద్వారా సరిదిద్దుకోవడానికి అదే రోజు అవకాశం కల్పిస్తారు.
- వెబ్ ఆప్షన్ల నమోదు: అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 వరకు తమకు కావలసిన కళాశాలలు, కోర్సుల కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్ల ఎడిట్: అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అక్టోబర్ 1న ఒక రోజు అవకాశం ఇస్తారు.
సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను అక్టోబర్ 5వ తేదీన కేటాయిస్తారు.ఈ ఫేజ్ కింద సీటు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీలోపు కేటాయించిన కళాశాలలకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదును సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

