TG CPGET Counselling : టీజీ సీపీగెట్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్ మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
TG CPGET Seat Allotment : తెలంగాణ సీపీగెట్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. 17,586 మందికి పీజీ సీట్లు లభించగా… ఇందులో అత్యధికంగా అమ్మాయిలే ఉన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు రిపోర్టింగ్ కు అవకాశం ఉంది.
TG CPGET Seat Allotment :రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ (TG CPGET) తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ వంటి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను మొత్తం 17,586 మంది అభ్యర్థులకు గురువారం రాత్రి అధికారులు సీట్లను కేటాయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద మొత్తం 47,237 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తొలి విడత కౌన్సెలింగ్‌లో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం కేవలం 37 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఈ విడత సీట్లు సాధించిన వారిలో అభ్యర్థుల సంఖ్యను పరిశీలిస్తే అమ్మాయిలకే ఎక్కువ సీట్లు దక్కాయి. మొత్తం సీట్లు పొందినవారి సంఖ్య 17,586గా ఉంటే ఇందులో అమ్మాయిలు 13,125 మంది ఉన్నారు.
రిపోర్టింగ్ తేదీ ఇదే…
సీపీగెట్ తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోపు రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి, సంబంధిత కాలేజీల్లో లేదా పోర్టల్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. గడువులోగా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయని వారి సీటును రద్దు చేస్తామని కన్వీనర్ స్పష్టం చేశారు.
అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా….
- ముందుగా https://cpgetadmissions.com/new/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- అలాట్ మెంట్ లాగిన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్. మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ అలాట్ మెంట్ డిటేయిల్స్ కనిపిస్తాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

