TG DOST Counselling : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల, కోర్సు మారేందుకు ఛాన్స్
TG DOST Internal Sliding 2026 : డిగ్రీ కాలేజీల్లో చేరిన విద్యార్థులు అదే కాలేజీలో కోర్సు మారేందుకు దోస్త్ ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 10 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.
TG DOST Internal Sliding 2026 : రాష్ట్రంలో దోస్త్ (DOST - డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రక్రియ ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొంది, ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. తాము చేరిన కళాశాలలోనే మరో కోర్సులోకి మారాలనుకునే విద్యార్థుల కోసం ఇంట్రా కాలేజ్ (ఇంటర్నల్ స్లైడింగ్) వెసులుబాటు కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య బాలకిష్టారెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ అంతర్గత మార్పుల ప్రక్రియకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీ పరిధిలోనే అందుబాటులో ఉన్న ఇతర గ్రూపులు లేదా కోర్సులను ఎంచుకోవడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడనుంది.
తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇంట్రా కాలేజ్ ఫేజ్ (ఇంటర్నల్ స్లైడింగ్) కోసం విద్యార్థులు ఈ నెల 10వ తేదీ (10.07.2026) నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జూలై 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు తమ లాగిన్ వివరాల ద్వారా దోస్త్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తాము కోరుకున్న కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
14న సీట్ల కేటాయింపు
వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్లు, ఆయా కోర్సుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ అంతర్గత స్లైడింగ్ ఫలితాలను….. అంటే కొత్త కోర్సుల సీట్ల కేటాయింపు వివరాలను జూలై 14వ తేదీన విడుదల చేస్తారు. సీటు మారిన విద్యార్థులు నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ప్రాసెస్ ఇలా….
- విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.
- క్యాండెట్ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ దోస్త్ ఐడీ ద్వారా లాగిన్ కావాలి.
- మారాలనుకుంటున్న కోర్సును ఎంచుకోవాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే ఈ ప్రాసెస్ పూర్తవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

