TG DOST 2026 Counseling : దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లకు ఇవాళే లాస్ట్ డేట్

TG DOST 2026 Special Phase Counseling : తెలంగాణ డిగ్రీ ప్రవేశాల దోస్త్ (TG DOST 2026) ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. కీలకమైన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూలై 27తో ముగియనుంది. వెంటనే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. 

Published on: Jul 27, 2026, 07:03:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG DOST 2026 Special Phase Counseling : ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. 'దోస్త్' ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఇవాళ్టితో (జూలై 27, 2026) ముగియనుంది. డిగ్రీ ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

దోస్త్ అడ్మిషన్లు
దోస్త్ అడ్మిషన్లు

ఇప్పటివరకు ఏ విడతలోనూ సీటు పొందని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రాసెస్ పూర్తి చేయడానికి జూలై 27, 2026 వరకు మాత్రమే అవకాశం కల్పించారు.

ఈనెల 30న సీట్ల కేటాయింపు…

వికలాంగులు (PH), సైనిక ఉద్యోగుల పిల్లలు, ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్, ఇతర పాఠ్యేతర కార్యకలాపాలకోటా ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఇవాళ యూనివర్సిటీ హెల్ప్‌లైన్ కేంద్రాలలో ధృవీకరణ పత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన జరుగుతుంది. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపును జూలై 30, 2026న పూర్తి చేయనున్నారు.

ఈ ప్రత్యేక విడతలో సీటు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవడానికి కొన్ని కీలక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇలా…

  • ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : సీటు కేటాయించిన విద్యార్థులు జూలై 30, 2026 నుండి ఆగస్టు 01, 2026 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • కాలేజీలో ఒరిజినల్ పత్రాల సమర్పణ : ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులు జూలై 31, 2026 నుండి ఆగస్టు 01, 2026 మధ్య తమ ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)తో పాటు ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలను కేటాయించిన కళాశాలలో సమర్పించాలి.
  • నిర్దేశిత గడువులోగా కాలేజీలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దవుతుంది.

ఇంతవరకు దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా అప్లై చేసుకోవచ్చు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఇప్పటివరకు జరిగిన ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన అభ్యర్థులు తమ పాత ఐడీ, పిన్ (PIN) ఉపయోగించి నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

గత విడతలలో సీటు వచ్చి, ఆ కాలేజీ నచ్చకపోవడంతో కొత్తగా వేరే కాలేజీకి మారాలనుకునే అభ్యర్థులు కూడా ఈ ప్రత్యేక విడత ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు తమకు సీటు లభించే అవకాశాలను పెంచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అలాట్ మెంట్ వివరాలను కూడా ఇదే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More