...
...
Next Story

TG DOST Seat Allotment 2026 : దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపు - కాలేజీ రిపోర్టింగ్ తేదీలు ఇవే!

TG DOST 3rd Phase Seat Allotment 2026 : దోస్త్ మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇందులో 93,516 మందికి సీట్లు దక్కించుకోగా… అత్యధికంగా కామర్స్ కోర్సులను ఎంచుకున్నారు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల హాజరు వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Jun 26, 2026, 10:54:24 IST
Advertisement

TG DOST 3rd Phase Seat Allotment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ (DOST) మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఉన్నత విద్యామండలి గురువారం ఈ విడత సీట్లను అధికారికంగా విడుదల చేసింది.

దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపు
దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపు

ఈ విడత కౌన్సిలింగ్‌లో మొత్తం 93,516 మంది విద్యార్థులు డిగ్రీ సీట్లను సొంతం చేసుకున్నారు. ఇందులో ఎప్పటిలాగే కామర్స్ కోర్సులకే విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కామర్స్ విభాగంలో అత్యధికంగా 37,510 మంది సీట్లు సాధించగా, ఆ తర్వాత స్థానంలో ఫిజికల్ సైన్సెస్ నిలిచింది. ఫిజికల్ సైన్సెస్ కోర్సుల్లో 21,942 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.

దోస్త్ మూడో విడతలో సీట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,07,284 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అయితే, అందుబాటులో ఉన్న సీట్లు, విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు 93,516 మందికి సీట్లను కేటాయించారు. సరైన వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడం లేదా డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులను మాత్రమే ఎంచుకోవడం వంటి కారణాల వల్ల ఈ విడతలో 13,768 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు. సీట్లు రాని విద్యార్థులు ఆందోళన చెందకుండా తదుపరి కౌన్సిలింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ తేదీలు….

మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి. విద్యార్థులు ఈ నెల 26 నుంచి జూలై 2వ తేదీ లోపు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks