...
...
Next Story

TG DOST Counselling 2026 : దోస్త్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే

TG DOST 3rd Phase Counselling 2026 : తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ మూడో విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇవాళ్టితో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల గడువు పూర్తి కానుంది. ఈనెల 25న సీట్లను కేటాయిస్తారు.

Published on: Jun 21, 2026 03:06 PM IST
Advertisement

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న 'డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ' (DOST-2026) మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ విడతకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, అలాగే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి కల్పించిన గడువు నేటితో పూర్తి కానుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు.. లేదా మంచి కాలేజీల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఈనెల 25న సీట్ల కేటాయింపు

TG DOST 2026 థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్
TG DOST 2026 థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్

ఈ మూడో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 25వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరై ప్రవేశాలను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

డిగ్రీలో చేరాలనుకునే అభ్యర్థులు చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తకుండా ముందే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది. మంచి కాలేజీలు, నచ్చిన కోర్సులను ఎంచుకోవడానికి వీలుగా ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్తగా రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలా చూసుకోవాలి. ఇప్పటికే మొదటి లేదా రెండో విడతలో సీటు వచ్చి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు, మెరుగైన కాలేజీ కోసం నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

ఒకవేళ ఫేజ్ 3 లో కొత్తగా సీటు వస్తే…. పాత సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుందని అభ్యర్థులు గమనించాలి. అభ్యర్థులు మరింత సమాచారం కోసం మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in ను సందర్శించవచ్చు.

TS DOST 2026 మూడో విడత - రిజిస్ట్రేషన్ ఇలా :

2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.

4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.

5. దరఖాస్తు రుసుము చెల్లించండి.

6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe