TG DOST Counselling : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' ఇంటర్నల్ స్లైడింగ్ షురూ, ఈనెల 13 వరకు వెబ్ ఆప్షన్లు
TG DOST Internal Sliding 2026 : డిగ్రీ కాలేజీల్లో చేరిన విద్యార్థులు అదే కాలేజీలో కోర్సు మారేందుకు దోస్త్ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్లు పొంది, ఇప్పటికే అడ్మిషన్లు ఖరారు చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అవకాశం కల్పించింది. ఇప్పటికే చేరిన కాలేజీలోనే వేరే కోర్సు లేదా గ్రూపు మారాలనుకునే విద్యార్థుల కోసం ఇంటర్నల్ స్లైడింగ్ (ఇంట్రా కాలేజ్ ఫేజ్) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ అయింది.

ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీని మార్చుకోలేరు. కేవలం తాము చదువుతున్న కాలేజీలోనే అందుబాటులో ఉన్న ఇతర కోర్సుల్లో ఖాళీలను బట్టి సీటు మార్చుకునే వీలుంటుంది.
ఇంట్రా కాలేజ్ ఫేజ్ (ఇంటర్నల్ స్లైడింగ్) కోసం విద్యార్థులు నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జూలై 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కోర్సు మారాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాల (DOST ID, PIN) ద్వారా దోస్త్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తాము కోరుకున్న కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్నల్ స్లైడింగ్ - ప్రాసెస్ ఇలా….
- విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.
- క్యాండెట్ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ దోస్త్ ఐడీ ద్వారా లాగిన్ కావాలి.
- మారాలనుకుంటున్న కోర్సును ఎంచుకోవాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే ఈ ప్రాసెస్ పూర్తవుతుంది.
జూలై 14న ఫలితాలు
వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే రిజర్వేషన్లు, అలాగే ఆయా కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీల ఆధారంగా ఉన్నతాధికారులు సీట్లను కేటాయిస్తారు. ఈ అంతర్గత స్లైడింగ్ ఫలితాలను….. అంటే కొత్త కోర్సుల సీట్ల కేటాయింపు వివరాలను జూలై 14వ తేదీన వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీటు మారిన విద్యార్థులు నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లో విధిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

