...
...
Next Story

TG DOST Special Drive 2026 : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల, ఇదే చివరి ఛాన్స్

TG DOST Special Drive 2026 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్, ఇంట్రా కాలేజ్ ఫేజ్-2 షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుతో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Published on: Aug 4, 2026, 05:12:45 IST
Advertisement

TG DOST Special Drive 2026 : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరో కీలకమైన అవకాశాన్ని కల్పించింది. వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు డిగ్రీ సీటు పొందలేని వారికి, ఇప్పటివరకు దోస్త్ (DOST) లో రిజిస్ట్రేషన్ చేసుకోని వారి కోసం 'స్పెషల్ డ్రైవ్ ఫేజ్'తో పాటు 'ఇంట్రా-కాలేజ్ ఫేజ్-2' షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

దోస్త్ స్పెషల్ డ్రైవ్,
దోస్త్ స్పెషల్ డ్రైవ్,

విద్యార్థులు, వివిధ కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రత్యేక విడతను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో సీటు సాధించలేకపోయిన విద్యార్థులకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది.

దోస్త్ స్పెషల్ డ్రైవ్ - షెడ్యూల్:

  • ఆగస్టు 6, 2026 నుండి ఆగస్టు 11, 2026 వరకు జరగనున్నాయి. రూ.400 రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆగస్టు 6, 2026 నుండి ఆగస్టు 12, 2026 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు, కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
  • PH, CAP, NCC, స్పోర్ట్స్, ఇతర సబ్‌పాఠ్య కార్యక్రమాల ధ్రువపత్రాల పరిశీలనను యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో (UHLCs) ఆగస్టు 12, 2026న నిర్వహిస్తారు.
  • అభ్యర్థులకు ఆగస్టు 14, 2026న సీట్లను కేటాయిస్తారు.
  • సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 14, 2026 నుండి ఆగస్టు 18, 2026 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన వారు ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 18, 2026 మధ్య నిర్ణీత కళాశాలలో నేరుగా రిపోర్ట్ చేయాలి.

ఇంట్రా-కాలేజ్ ఫేజ్-2 షెడ్యూల్ వివరాలు….

ఇదివరకు దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు పొందని అభ్యర్థులు తమ పాత DOST ఐడీ,పిన్ ఉపయోగించి నేరుగా స్పెషల్ డ్రైవ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లలో పాల్గొనవచ్చు. ఇప్పటివరకు దోస్త్ లో అసలు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు రూ.400 రుసుము చెల్లించి కొత్తగా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే సిసిఓటిపి ద్వారా కాలేజీలలో సీటు కన్ఫర్మ్ చేసుకున్న విద్యార్థులు ఈ స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌కు అర్హులు కారు. ప్రవేశం పొందే అవకాశాలను పెంచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.

TS DOST 2026 - రిజిస్ట్రేషన్ ఇలా :

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.

2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.

4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.

5. దరఖాస్తు రుసుము చెల్లించండి.

6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe