TG EAPCET 2026 కౌన్సెలింగ్ : ఇంజినీరింగ్ అభ్యర్థులకు మాక్‌ అలాట్‌మెంట్ - మీ సీటు వివరాలు ఇలా చెక్ చేసుకోండి

TG EAPCET Mock Seat Allotment : టీజీ ఈఏపీసెట్ -2026 తొలి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి మాక్‌ అలాట్‌మెంట్‌ పూర్తి అయింది. ఈ మాక్‌ అలాట్‌మెంట్‌లో 79,313 మందికి మాక్‌ సీట్లు కేటాయించారు. https://tgeapcet.nic.in  వెబ్ సైట్ ద్వారా మీకు ఏ కాలేజీలో సీటు అలాట్ అయిందో చెక్ చేసుకోవచ్చు.

Published on: Jul 5, 2026, 05:12:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG EAPCET Mock Seat Allotment 2026 : టీజీ ఈఏపీసెట్ -2026 ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తొలి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి శనివారం (జులై 4) అధికారులు మాక్‌ అలాట్‌మెంట్‌ను పూర్తి చేశారు. ఈ ప్రాసెస్ లో మొత్తం 79,313 మంది విద్యార్థులకు మాక్‌ సీట్లను కేటాయించారు. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లలో నమోదు చేసుకున్న కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యత ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి.

TG EAPCET 2026 కౌన్సెలింగ్ - ఇంజినీరింగ్ అభ్యర్థులకు మాక్‌ అలాట్‌మెంట్..!
TG EAPCET 2026 కౌన్సెలింగ్ - ఇంజినీరింగ్ అభ్యర్థులకు మాక్‌ అలాట్‌మెంట్..!

మాక్ అలాట్ మెంట్ - డౌన్లోడ్ ఇలా

విద్యార్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీ నంబర్‌, ఎప్‌సెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ మరియు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి తమ మాక్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ ( https://tgeapcet.nic.in ) నుంచి మాక్ అలాట్ మెంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 179 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద విద్యార్థులకు 89 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. టీజీ ఈఏపీసెట్ -2026 కౌన్సెలింగ్‌ కోసం దాదాపు 94 వేల మంది విద్యార్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోగా…… వారిలో 88 వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమకు నచ్చిన కాలేజీల ఆప్షన్లను నమోదు చేశారు.

ఆప్షన్లు మార్చుకోవచ్చు….

ఈ మాక్‌ అలాట్‌మెంట్‌ అనేది విద్యార్థులకు తాము పెట్టిన ఆప్షన్ల ప్రకారం ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశముందో ముందే ఊహించుకోవడానికి ఒక అంచనా మాత్రమే. ఈ కేటాయింపులో వచ్చిన సీటు నచ్చకపోయినా.. లేదా అంతకంటే మెరుగైన కళాశాలలో సీటు ఆశించినా అభ్యర్థులు తమ ఆప్షన్లను పునఃసమీక్షించుకోవచ్చు.

కాలేజీల ప్రాధాన్య క్రమాన్ని మార్చుకునేందుకు జులై 5 నుంచి జులై 7 వరకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏ మార్పులు అవసరం లేదనుకుంటే…. విద్యార్థులు తొలుత ఇచ్చిన ఆప్షన్లనే తుది సీట్ల కేటాయింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. తొలి విడత అసలు సీట్ల కేటాయింపు ఫలితాలను జులై 10న ప్రకటిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు జులై 14ను తుది గడువుగా నిర్ణయించారు.

ఒకవేళ నిర్ణీత గడువులోగా ఎలాంటి మార్పులు చేయకపోతే…. మాక్ కౌన్సెలింగ్ సమయంలో ఉంచిన ఆప్షన్లనే తుది ఆప్షన్లుగా సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా పరిగణిస్తుంది. కాబట్టి ఈ విషయంలో విద్యార్థులు…. జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

జులై 17 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

టీజీ ఈఏపీసెట్ - 2026 మొదటి విడత సీట్ల కేటాయింపు ముగిసిన అనంతరం….. జులై 17వ తేదీ నుండి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనుండగా, జులై 18, 19 తేదీల్లో విద్యార్థులు రెండో విడత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా విద్యార్థులు పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ ద్వారానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More