TG EAPCET 2026 : టీజీ ఈఏపీసెట్ అప్డేట్ - ఫైన్ లేకుండా దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ..!

TG EAPCET  Applications 2026 : టీజీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఫైన్ లేకుండా ఈ గడువు ఇవాళ్టితో (ఏప్రిల్ 4) పూర్తి కానుంది. అర్హులైన విద్యార్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Published on: Apr 4, 2026, 09:18:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులకు గడువు దగ్గరపడింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఇవాళ్టి వరకే (ఏప్రిల్ 4) అవకాశం ఉంది. ఈ తేదీ దాటితే… నిర్దేశించిన ఫీజుతో పాటు ఆలస్య రుసుం కూడా చెల్లించాలి. కాబట్టి అర్హులైన విద్యార్థులు…. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అదికారులు సూచిస్తున్నారు.

టీజీ ఈఏపీసెట్ దరఖాస్తులు (image sourec istock)
టీజీ ఈఏపీసెట్ దరఖాస్తులు (image sourec istock)

ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఫైన్ తో అయితే… మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పరీక్షా జోన్‌లను ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 టెస్ట్ జోన్లు ఉండగా…. 10కిపైగా జోన్లు ఇప్పటికే నిండిపోయాయి.

ఇంజినీరింగ్ స్ట్రీమ్ అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ కు కలిపి దరఖాస్తు చేసుకునేంటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000, ఇతరులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు మాత్రమే ఈ ఫీజులుంటాయి. తేదీ మారితే…ఈ ఫీజుతో పాటు ఆలస్య రుసుంను కూడా చెల్లించాలి.

TG EAPCET 2026 పరీక్ష తేదీలు…..

టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.

టీజీ ఈఏపీసెట్ 2026 - ముఖ్యమైన తేదీలు

టీజీ ఈఏపీసెట్ దరఖాస్తులకు చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.

రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026.

రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026.

రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026.

రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026.

రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026.

అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More