రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. సమయం దగ్గరపడుతున్న వేళ… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అదికారులు సూచిస్తున్నారు.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఫైన్ తో అయితే… మే 2 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పరీక్షా జోన్‌లను ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అధికారులు వాటిని బ్లాక్ చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో పరీక్షా జోన్లను స్తంభింపజేసింది. ఈ జిల్లాల నుండి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 టెస్ట్ జోన్లు ఉండగా…. 10 జోన్లు ఇప్పటికే నిండిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్(జోన్ 1, 2, 3), ఖమ్మం, సత్తుపల్లి, వరంగల్ కేంద్రాల్లోనే స్లాట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
పరీక్ష తేదీలు…..
టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
టీజీ ఈఏపీసెట్ 2026 - ముఖ్యమైన తేదీలు
టీజీ EAPCET దరఖాస్తులకు చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
{{/usCountry}}టీజీ EAPCET దరఖాస్తులకు చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
{{/usCountry}}రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026.
రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026.
రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026.
రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026.
రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026.
అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/