TG EAPCET 2nd Phase Counselling : టీజీ ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ - ఈనెల 17 నుంచి రిజిస్ట్రేషన్లు

TG EAPCET 2nd Phase Counselling : తెలంగాణ ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో 60,300 మంది అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా… మిగిలిన సీట్ల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published on: Jul 16, 2026, 12:47:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG EAPCET 2nd Phase Counselling : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూలై 17వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగియడంతో…. ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ విడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు.

టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026

షెడ్యూల్ వివరాలు :

రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూలై 18వ తేదీన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) చేపడతారు. ఆ తర్వాత జూలై 18, 19 తేదీల్లో అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు జూలై 22న లేదా ఆ లోపు రెండో విడత సీట్లను కేటాయిస్తామని ప్రవేశాల కార్యాలయం స్పష్టం చేసింది.

ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో కేవలం 60,300 మంది మాత్రమే కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. వీరంతా ఆన్‌లైన్ ద్వారా ఫీజులు చెల్లించి, వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. నిజానికి ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 88,053 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం 88,510 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.

ఈ విద్యా సంవత్సరం (2026-27) దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే ఏఐసీటీఈ (AICTE) తెలంగాణకు అదనంగా మరో 15 వేల బీటెక్‌ సీట్లను మంజూరు చేసింది. ముఖ్యంగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ కోర్సుల్లో ఈ సీట్లు పెరిగాయి. అయితే…. ఈ అదనపు సీట్లను ప్రస్తుత కౌన్సెలింగ్‌లో చేర్చాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు గురువారం ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు. సీఎం ఆమోదం తెలిపితే ఈ 15 వేల సీట్లు కూడా రెండో విడత లేదా తదుపరి విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More