రాష్ట్రంలో బీఫార్మసీ, ఫార్మాడీ బీటెక్ బయోమెడికల్, బయో టెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగియగా… ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలైంది. రిజిస్ట్రేషన్లకు ఇవాళ ఒక్కరోజే అవకాశం ఉంది.

అర్హులైన అభ్యర్థులు https://tgeapcetb.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 17వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈనెల 17, 18 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈనెల 18వ తేదీన ఫ్రీజింగ్ చేసుకోవచ్చు.
ఈనెల 21వ తేదీన లేదా ఆలోపే ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు ఈనెల 21 నుంచి 22 తేదీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఈనెల 24 నాటికి ప్రవేశాల ప్రక్రియ ముగుస్తుంది.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…
- అర్హులైన విద్యార్థులు https://tgeapcetb.nic.in/payFeeOnline.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా లాగిన్ వివరాలను నమోదు చేయాలి. ఇందులో TGEAPCET-B హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- ఆ తర్వాత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.(బీసీ, ఓసీ రూ1200, ఎస్సీ ఎస్టీ రూ. 600)
- అనంతరం స్లాట్ బుకింగ్ ఆప్షన్ పై నొక్కి ప్రాసెస్ రిజిస్రేషన్ పూర్తి చేసుకోవాలి.
- వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంచుకోవాలి.
- అలాట్ మెంట్ కాపీని కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పొందాలి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ - కావాల్సిన పత్రాలు:
- TGEAPCET -2025 ర్యాంక్ కార్డు
- టీజీ ఈఏపీసెట్ హాల్ టికెట్
- ఆధార్ కార్డు
- టెన్త్ మెమో
- ఇంటర్ మెమో
- ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
- టీసీ
- ఆదాయపు ధ్రువీకరణపత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- రెసిడెన్సీ సర్టిఫికెట్
- ఇతర పత్రాలు
ఇటీవలనే బైపీసీ విద్యార్థులకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఆయా కోర్సుల్లో 93.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 10,708 సీట్లు అందుబాటులో ఉండగా.. 15,192 మంది సీట్ల కోసం పోటీపడ్డారు. వీరిలో 10,012 మందికి సీట్లు దక్కాయి. ఇక ఈనెల 23వ తేదీ నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు.
{{/usCountry}}ఇటీవలనే బైపీసీ విద్యార్థులకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఆయా కోర్సుల్లో 93.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 10,708 సీట్లు అందుబాటులో ఉండగా.. 15,192 మంది సీట్ల కోసం పోటీపడ్డారు. వీరిలో 10,012 మందికి సీట్లు దక్కాయి. ఇక ఈనెల 23వ తేదీ నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు.
{{/usCountry}}