...
...
Next Story

TG EAPCET 2026 : మే మొదటి వారంలో ఈఏపీసెట్…! షెడ్యూల్ ఖరారుపై కసరత్తు

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ - 2026పై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మే మొదటి వారంలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. షెడ్యూల్ పై కసరత్తు కొనసాగతుండగా.. త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

Published on: Dec 13, 2025 03:29 PM IST
Advertisement

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌ - 2026 ప్రవేశ నోటిఫికేషన్ పై కసరత్తు కొనసాగుతోంది. త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. ప్రాథమికంగా పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

మే ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్….!

మే మొదటి వారంలో ఈఏపీసెట్…! షెడ్యూల్ ఖరారుపై కసరత్తు
మే మొదటి వారంలో ఈఏపీసెట్…! షెడ్యూల్ ఖరారుపై కసరత్తు

టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షను మే మొదటి వారంలో నిర్వహించే యోచనలో ఉన్నత విద్యామండలి ఉంది. మే 4, 5 తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ పై కసరత్తు పూర్తి కాగా…. ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఇందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది.

ఈసారి కూడా జేఎన్టీయూనే ఎంట్రెన్స్ బాధ్యతలను చూసే అవకాశం ఉంది. ఎప్‌సెట్‌ షెడ్యూల్ వచ్చే వారం లేదా మరో వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇంటర్, జేఈఈ పరీక్షల దృష్ట్యా…మే మొదటి వారంలో ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహిస్తే ఉత్తమం అని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ఖరారు అయితే జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి నెలలో ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే… విద్యా్ర్థులకు ఇబ్బందులు రాకుండా ఈఏపీసెట్ షెడ్యూల్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈసారి ఏప్రిల్ చివరి, మే మొదటి వారంలో ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్, ఫార్మాసీ స్ట్రీమ్ పరీక్షలను వేర్వురు తేదీల్లో నిర్వహించారు. ప్రాథమిక కీలను విడుదల చేసిన తర్వాత….మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు… సీట్ల భర్తీని పూర్తి చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe