TG ECET 2026 Counseling : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు కీలక అలర్ట్. 'టీజీ ఈసెట్ (TG ECET) 2026' మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అర్హత సాధించిన డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులు జూన్ 18 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) స్పష్టం చేసింది. నేటితోనే ఈ గడువు ముగియనుండటంతో అభ్యర్థులు అప్రమత్తం కావాలి.

కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1,200 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 ఆన్‌లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్స్ ఉపయోగించి చెల్లించాలి. ఈ ఫీజు చెల్లించిన తర్వాతే ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది.
ముఖ్య తేదీలు :
అభ్యర్థులకు జూన్ 19 వరకు నిర్ణీత హెల్ప్‌లైన్ కేంద్రాలలో ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికేట్ వెరిఫికేషన్) నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే జనరల్ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి.
స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 21 లోపు తమకు నచ్చిన కళాశాలలు, కోరుకున్న బ్రాంచ్‌ల వారీగా వెబ్ ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆప్షన్లు ఖరారు చేసుకున్నాక వాటిని ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది.
ఈ వెబ్ ఆప్షన్ల ఆధారంగా మొదటి విడత తాత్కాలిక సీట్ల కేటాయింపు ఫలితాలను జూన్ 24న లేదా అంతకంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 24 నుంచి జూన్ 27 మధ్య ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారానే సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులు సమర్పించిన మొబైల్ నంబర్లను మార్చడానికి వీలుండదని అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసేవరకు అదే నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోని అభ్యర్థులు మొదటి విడతలో సీటు పొందే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది.
{{/usCountry}}రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులు సమర్పించిన మొబైల్ నంబర్లను మార్చడానికి వీలుండదని అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసేవరకు అదే నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోని అభ్యర్థులు మొదటి విడతలో సీటు పొందే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది.
{{/usCountry}}